తెలంగాణ

బడ్జెట్‌లో గిరిజనులకు రూ.13, 378.5 కోట్లు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2016-17లో గిరిజనుల కోసం రూ.13378.5 కోట్లు కేటాయించాలని ఇఫ్లూ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇస్లావత్ రాజు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ శోభన్ నాయక్ అధ్యక్షతన జరిగిన రచ్చబండ సమావేశంలో ఇస్లావత్ రాజు ప్రసంగించారు. గిరిజనుల ఆర్ధిక స్థోమత పెరిగినప్పుడే వారు సమాజంలో నిలదొక్కుకోగలుగుతారని ఆయన అన్నారు. అందుకే బడ్జెట్ కేటాయింపులు సరిపడా చేస్తే అభివృద్ధి చెందుతారని తెలిపారు. గిరిజనుల సంక్షేమం పట్ల ఇప్పటివరకు పని చేసిన ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. శోభన్‌నాయక్ మాట్లాడుతూ షెడ్యూల్ తెగలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని, గిరిజన తండాలు, గూడెంలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.