ఆంధ్రప్రదేశ్‌

ఏపి జెన్‌కో సిఎండికి ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఎపి జెన్‌కో సిఎండి కె.విజయానంద్‌కు ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది. విజయానంద్ ఎపిజెన్‌కో, ట్రాన్స్‌మిషన్ విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అత్యద్భుతమైన నిర్వహణ సామర్ధ్యాన్ని కనబర్చి ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించినందుకు ఈ అవార్డును న్యూఢిల్లీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ సంస్థ విజయానంద్‌కు అందజేసింది. అలాగే నిరంతరం ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన ఎపి జెన్‌కో సంస్థకు బంగారు పతకం బహుకరించింది. గోవాలో జరిగిన కార్యక్రమంలో హర్యానా, పంజాబ్ గవర్నర్ సోలంకి చేతుల మీదుగా విజయానంద్ ఈ అవార్డును అందుకున్నారు. విజయానంద్ అనేక అవార్డులను ఇప్పటికే స్వీకరించారు. ఎపి జెన్‌కో లక్ష్యాలను చేరుకోవడంలో ఆయన పనితీరు అద్భుతంగా ఉందని ఎకనమిక్ స్టడీస్ సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది. జెన్‌కో ఆర్థిక పరిపుష్టికి ఆయన విశేషంగా కృషి చేయడం ద్వారా గత దశాబ్ధకాలంగా లాభాల్లో ఉంది. అవార్డు స్వీకరించిన సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ 2014 జూన్ నాటికి రోజుకి 22 మిలియన్ యూనిట్లు లోటు ఉన్న స్థాయి నుంచి మిగులు విద్యుత్ సాధించే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ఇందుకు కారణం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అద్భుతమైన నాయకత్వంలో పని చేయడమే కారణమని అన్నారు. ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల విద్యుత్ రంగంలో ఎపి ఉన్నత శిఖరాలను చేరి దేశం మొత్తం ఆదర్శంగా నిలిచిందని అన్నారు.