ఆంధ్రప్రదేశ్‌

సచివాలయం బురదమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/గుంటూరు, జూన్ 29: గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం బురదలో చిక్కుకుపోయింది. రెండు రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాల వల్ల ఈ ప్రాంతమంతా చిత్తడిగా మారింది. సచివాలయానికి నాలుగు వైపులా నడవడానికి వీల్లేనంతగా బురద పేరుకుపోయింది. అసలే నల్లరేగడి భూములు కావటంతో చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతమంతా బురదమయమైపోతోంది. కొద్దిరోజుల క్రితం సచివాలయానికి నిర్మించిన అప్రోచ్ రోడ్డుపై బురద పేరుకుపోవడంతో ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సచివాలయాన్ని ప్రారంభించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బడిముబ్బడిగా వస్తుండటంతో వారు బురదబారిన పడకుండా ఉండేందుకు సిబ్బంది చేసిన తాత్కాలిక ఏర్పాట్లు కూడా ఫలించలేదు.
దీంతో సచివాలయానికి వచ్చిన ప్రతిఒక్కరూ ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలావుంటే, సచివాలయంలో బుధవారం ప్రారంభించిన బ్లాకుల్లో పనులు ఏమాత్రం పూర్తికాలేదు. ఓపక్క జోరున వర్షం కురుస్తున్నా సిమెంట్ పనులను నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మరోపక్క యుపివిసి కిటికీలను ఆదరాబాదరా అమర్చడం కనిపించింది. ఇప్పటికే అమర్చిన కిటికీల నుంచి వర్షపు నీరు ఛాంబర్లలోకి వచ్చేస్తోంది. ఛాంబర్లలో వైరింగ్ పని పూర్తికాలేదు. వర్కింగ్ స్టేషన్లను నామ్‌కేవాస్తేగా అమర్చారు. గోడలకు బదులు జిప్సమ్ షీట్లను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. వీటికి తుదిరూపు తీసుకొచ్చేందుకు కనీసం నెలరోజుల వ్యవధి పడుతుందని సిబ్బంది చెప్పుకొచ్చారు. ఇవన్నీ పూర్తవడానికి కనీసం నెలరోజులు పడుతుందని చెపుతున్నారు.
త్వరలో అంతా చక్కబడుతుంది:సీఎస్ టక్కర్
తాత్కాలిక రాజధానికి ఉద్యోగులను తరలించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా నాలుగు ప్రధాన కార్యాలయాలను సచివాలయంలో ప్రారంభించామని, వచ్చే నెలాఖరుకు పూర్తిస్థాయిలో కార్యాలయాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ తెలిపారు. సచివాలయ ప్రాంగణంలో రోడ్లు, ఫ్లోరింగ్, ప్రధాన రహదార్లతో పాటు టాయిలెట్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి సచివాలయంలో పూర్తిస్థాయి విధులు ప్రారంభం అవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇబ్బందికరమే., అయినా తప్పదు: మురళీకృష్ణ
తొలిరోజే సచివాలయంలో ఇబ్బందులు ఎదురైనమాట వాస్తవమేనని, అయితే ప్రజాప్రయోజనాల కోసం తాము తరలిరాక తప్పదని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ అన్నారు. కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నందున అన్నిస్థాయిల్లో సదుపాయాలు ఇప్పుటికప్పుడే కష్టతరమవుతాయని చెప్పారు.