ఆంధ్రప్రదేశ్‌

ఏలూరులో కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 28: పశ్చిమ గోదావరి జిల్లాలో కక్షలు, కార్పణ్యాలకు వేదికైన పినకడిమి వివాదాల నేపథ్యంలో జిల్లా కేంద్రం ఏలూరులో మంగళవారం రాత్రి మరోసారి కిరాయి హంతకులు తెగబడ్డారు. తుపాకులతో జరిపిన కాల్పుల్లో తూరపాటి నాగరాజు అనే వ్యక్తి గాయపడ్డాడు. వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లి తన స్నేహితుని వాహనంపై ఇంటికి తిరిగివెళ్తున్న నాగరాజుపై నలుగురు అగంతకులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి కాల్పులు జరిపారు. ఈప్రమాదంలో ఒక బుల్లెట్ ఆయన శరీరానికి తగిలిందని, మరొకటి కిందపడిపోయిందని ఈలోగా కలకలం రేగటంతో అగంతకులు పరారీ అయ్యారు. ఘటనలో గాయపడ్డ నాగరాజు అలాగే ఇంటికి చేరుకుని అక్కడి నుంచి 108 వాహనం ద్వారా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నాడు. అయితే నాగరాజు ఒంట్లో బుల్లెట్ దిగిందా, లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, డిఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.
గతంలోనూ హత్యాయత్నం
పెదవేగి మండలం పినకడిమికి చెందిన బూతం దుర్గారావుకు ఏలూరులో కీలకమైన ప్రాంతంలో పలు ఆస్తులున్నాయి. దుర్గారావు, తూరపాటి నాగరాజు కుటుంబాల మధ్య ఒకప్పుడు మంచి సంబంధాలే ఉండేవి. అయితే ఒక వివాహం విషయంలో ఈ కుటుంబాల మధ్య వైరుధ్యం తలెత్తింది. విద్వేషాల స్ధాయిని దాటి కక్షలు, కార్పణ్యాల రేంజ్‌కి చేరిపోయింది. ఈ నేపథ్యం లోనే 2014 ఏప్రిల్‌లో బూతం దుర్గారావు పినకడిమిలో వాకింగ్ చేస్తుండగా కొందరు కాల్పులు జరిపి ఆయనను హతమార్చారు. ఈకేసులో తూరపాటి నాగరాజు ప్రధాన నిందితుడు. ఆ తరువాత నాగరాజుపై దుర్గారావు కుటుంబం కక్ష పెంచుకుని అతని కోసం వేటాడుతూనే ఉంది. కోర్టులో కేసులు నడుస్తుండగానే మరోవైపు బయట వేట కొనసాగుతూనే ఉంది.

ఇదే కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వస్తున్న నాగరాజు కుటుంబసభ్యులు, అనుచరులపై కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద కిరాయిహంతకులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అనంతర పరిణామాల్లో హైదరాబాద్‌లో ఉంటున్న తూరపాటి నాగరాజుపై 2015లో హత్యాయత్నం జరిగింది. దానినుంచి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. తాజాగా ఏలూరులో మంగళవారం మరోసారి హత్యాయత్నం జరగటం గమనార్హం. ఇది కూడా కిరాయిహంతకుల పనేనన్న అనుమానాలు