ఆంధ్రప్రదేశ్‌

కల నిజమాయెగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/గుంటూరు, జూన్ 28: స్వరాష్ట్రం నుంచి పాలన ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలు సాకారం అవుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పదేళ్ళపాటు హైదరాబాద్‌నే రాజధానిగా వినియోగించుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం వీలైనంత త్వరగా స్వరాష్ట్రం నుంచే పాలన సాగించాలని భావించి, కట్టుబట్టలతో విజయవాడకు చేరుకున్నారు. అమరావతిలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. విదేశీ సంస్థలను రంగంలోకి దించారు. ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు రావాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అన్ని భవనాలను ఒకేసారి నిర్మించడం సాధ్యం కాదు. దీనివలన స్వరాష్ట్రం నుంచి పాలన సాగించాలన్న తన సంకల్పం సిద్ధించదని భావించిన చంద్రబాబు తాత్కాలిక సచివాలయానికి అంకురార్పణ చేశారు. ఆయన ఆశయానికి అనుగుణంగా తాత్కాలిక సచివాలయం రూపుదిద్దుకుంది. ఇందులో ఒక బ్లాక్ నుంచి కొన్ని శాఖలు కార్యకలాపాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాజధానిలో జరిగిన తొలి నిర్మాణం సచివాలయమే కావడం విశేషం.
బుధవారం మధ్యాహ్నం 2.59 గంటలకు ఐదవ బ్లాకులోని గ్రౌండ్ ఫ్లోర్‌లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, గృహనిర్మాణం, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రుల ఛాంబర్లు, ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీల ఛాంబర్లతోపాటు, ఉద్యోగుల వర్కింగ్ స్టేషన్స్‌కూడా ప్రారంభంకానున్నాయి. ఇకపై మంత్రివర్గ సమావేశాలు, శాఖల సమీక్షలు ఇక్కడే జరగనున్నాయి. 2015 ఫిబ్రవరి 17న తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన జరిగింది. జి ప్లస్ సిక్స్ అంతస్తులతో ఐదు బ్లాకులుగా సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం వంద అడుగుల లోతు నుంచి పిల్లర్స్ వేసుకుంటూ వచ్చారు. ఈ తాత్కాలిక సచివాలయంలో 1,2 బ్లాకులను షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ, 3,4,5 బ్లాకుల నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టి చేపట్టింది. ఈనెల 27 నుంచి ఈ సచివాలయం నుంచి పాలన ప్రారంభించాలని అనుకున్నారు. అనివార్య కారణాల వలన నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరిగింది. మొత్తం మీద 29 నుంచి పాలన ప్రారంభమవుతోంది. సుమారు 730 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన సగం మొత్తాన్ని ఆప్కాబ్ రుణంగా ఇచ్చింది. 15 సంవత్సరాల్లోపు 10 శాతం వడ్డీతో ఆప్కాబ్‌కు ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది.
ఒకటవ బ్లాకులో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, చీఫ్ సెక్రటరీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. భద్రతాపరంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర నిష్క్రమణ, బులెట్ ప్రూఫ్ అద్దాలతో సిఎం ఛాంబర్‌ను నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 21 నుంచి సచివాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
ఐదో బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, స్ర్తి, శిశు సంక్షేమ శాఖలు ఏర్పాటు కానున్నాయి. ఇదే భవనంలో 400 మందికి సౌకర్యంగా ఉండే కాన్ఫరెన్స్ హాలు నిర్మాణం జరుగుతోంది. ఇకపై మంత్రివర్గ సమావేశాలతోపాటు ప్రభుత్వ శాఖల సమీక్షలన్నీ ఈ హాలులోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
మరికొద్ది రోజుల్లో యాక్సెస్ రోడ్డు ఏర్పాటు కానుంది. సచివాలయానికి కనెక్టివిటీ పెంచడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి చేరుకోవాలంటే కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే సాధ్యపడుతోంది. ఇదిలాఉండగా సింగపూర్ మాస్టర్‌ప్లాన్ అభివృద్ధికి స్విస్ ఛాలెంజి పద్ధతిని అవలంబించాలని మంత్రివర్గం నిర్ణయించడంతో మరికొద్దిరోజుల్లో విదేశీ సంస్థలు తరలి రానున్నాయి.

చిత్రం... తాత్కాలిక సెక్రటేరియట్‌లో పనులు జరుగుతున్న దృశ్యం