ఆంధ్రప్రదేశ్‌

అట్టుడికిన సాల్మన్‌రాజుపేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 28: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మత్స్యకార గ్రామం సాల్మన్‌రాజుపేటలో రెండు వర్గాల మధ్య మంగళవారం చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. రాజయ్యపేటకు చెందిన పలువురు యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి సాల్మన్‌పేట గ్రామస్తులపై దాడిచేశారు. గ్రామంలో చిన్నా,పెద్దా, ఆడ,మగ తేడా లేకుండా దొరికినవారిని దొరికినట్టు గాయపరిచారు. దాడిలో సుమారు 60 మంది వరకూ గాయపడినట్టు తెలిసింది. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాధమిక చికిత్స నిమిత్తం తొలుత తూర్పుగోదావరి జిల్లా తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో రామ్మూర్తి, అప్పలరాజు, సత్తిరాజు, రాణి, నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సాల్మన్‌రాజుపేట చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నర్సీపట్నం ఎఎస్పీ రస్తోగి, ఆర్‌డిఓ సూర్యారావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత గ్రామానికి చేరుకుని ఘటన వివరాలను తెలుసుకున్నారు. నిందితులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని బాధితులకు హామీ ఇచ్చారు. సాల్మన్‌రాజుపేటలో చోటుచేసుకున్న సంఘటన వెనుక పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాల్మన్‌రాజు పేటలో మత్స్యకారులు, శివారు రాజయ్యపేటలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య గత కొంతకాలంగా విబేధాలు నెలకొన్నాయి. రాజయ్యపేటకు చెందిన విద్యార్థినుల పట్ల సాల్మన్‌రాజుపేట యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపిస్తూ వారికి దేహశుద్ధి చేశారు. దీంతో మత్స్యకార యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చిన్న సమస్యగా భావించిన పోలీసులు ప్రాధాన్యత ఇవ్వలేదు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అక్కసుతో సాల్మన్‌రాజుపేటపై రాజయ్యపేటకు చెందిన యాదవ సామాజికవర్గం వ్యక్తులు మూకుమ్మడి దాడికి దిగి బీభత్సం సృష్టించారు. సంఘటన అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని, రెండు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.