ఆంధ్రప్రదేశ్‌

కడియంలో ఫ్లోరీకల్చర్ హబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 28: దేశవ్యాప్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) విధానంలో ఫ్లోరీకల్చర్‌ను అభివృద్ధి చేస్తున్నామని జాతీయ వ్యవసాయ పరిశోథనా మండలి (ఐసిఎఆర్) ఉద్యానవన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టి.జానకిరామ్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నాలుగు రోజులపాటు జరగనున్న 25వ అఖిల భారత పూల సమన్వయ పథకం వార్షిక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటిఆర్‌ఐలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జానకీరామ్ మాట్లాడుతూ నర్సరీలకు ప్రాచుర్యం పొందిన తూర్పుగోదావరి జిల్లాలోని కడియం ప్రాంతాన్ని నర్సరీహబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఫ్లోరీకల్చర్ విభాగంలో గత 25ఏళ్లుగా శాస్తవ్రేత్తలు అద్భుతమైన పరిశోధనలు అందించారని ప్రశంసించారు. దేశంలో 3.50 లక్షల హెక్టార్లలో ఫ్లోరీకల్చర్ విస్తరించిందని, 250 రకాల పూల సాగు జరుగుతోందన్నారు. శాస్తవ్రేత్త ఆర్‌సి భట్ రూపొందించిన కృష్ణా అనే రకం ఆస్ట్రేలియాకు ఎగుమతి జరుగుతూ కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోందన్నారు. దేశంలో నర్సరీలు, ఫ్లోరీ కల్చర్‌కు మార్గదర్శకాలను రూపొందించడానికి కసరత్తు జరుగుతోందన్నారు. సాగుచేసే ప్రతీ పూల వెరైటీని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. సదస్సులో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ డాక్టర్ బిఎంసి రెడ్డి మాట్లాడుతూ ఫ్లోరీకల్చర్ దేశంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కట్ ఫ్లవర్స్, లూజ్ ఫ్లవర్స్‌కు డిమాండ్ విపరీతంగా ఉందన్నారు. ఏపిలో లూజ్ ఫ్లవర్స్ సాగు అత్యధికంగా జరుగుతోందని, 98.58 లక్షల మెట్రిక్ టన్నుల పూల ఉత్పత్తి జరుగుతోందన్నారు. రూ.8.5 కోట్ల విలువైన కట్ ఫ్లవర్స్‌ను థాయ్‌లాండ్, నెదర్లాండ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, రూ.320 కోట్ల విలువైన డ్రై ఫ్లవర్స్ ఎగుమతి చేస్తున్నామని వివరించారు.రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటిఆర్‌ఐ) డైరెక్టర్ డాక్టర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పొగాకు ఆకు ఘాటైనా పూలు మాత్రం సువాసనలు వెదజల్లుతాయని వీటిని ఫ్లోరీకల్చర్‌లో అభివృద్ధి చేయాలన్నారు. డాక్టర్ వైఎస్ ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరీ కల్చర్, పూణె సంయుక్త ఆధ్వర్యంలో ఈ వార్షిక సమన్వయ పథకం సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు వంద మంది శాస్తవ్రేత్తలు హాజరయ్యారు.

సదస్సులో పాల్గొన్న ఐసిఎఆర్ ఎడిజి జానకిరామ్ తదితరులు