ఆంధ్రప్రదేశ్‌

పౌష్టికాహారంపై ఎమ్మెల్యేల ఫోరం చైర్మన్‌గా చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ఆంధ్రప్రదేశ్‌లో పౌష్టకాహారంపై ప్రత్యేక చర్యలు తీసుకుని పెద్ద ఎత్తున ఒక ఉద్యమం మాదిరి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యేలతో ఒక ఫోరం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పౌష్టికాహారంపై చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఎమ్మెల్యేలను ఫోరంలో సభ్యులుగా నియమిస్తారు. ఈ క్రమంలో ఫోరం రూపురేఖలు, నియమనిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు యునిసెఫ్, శాసనసభ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న వర్షాకాల సమావేశాల నాటికి ఈ ఫోరం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ వేదికగా ఇటీవల అంతర్జాతీయ సదస్సు ఒకటి జరగ్గా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు చట్టసభల ప్రతినిధులను భాగస్వామ్యులను చేస్తూ ఒక ఫోరం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భవిష్యత్‌లో చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించాల్సిన ఆవశ్యకతను సభాపతి వివరిస్తూ, శాసనసభ్యుల భాగస్వామ్యం, ఫోరం ఆవశ్యకతను వివరించారు. విధి విధానాలు, అజెండా, ఫోరంలో ఉండాల్సిన సభ్యులు వంటి అంశాలపై స్పష్టత రావాలని కోడెల పేర్కొన్నారు. మరోవైపు ఫోరంలో తగిన పాత్ర పోషించేందుకు ఆసక్తి ఉన్న సభ్యులను గుర్తించే క్రమంలో అందరికీ లేఖలు రాయాలని, సంసిద్ధత వ్యక్తపరిచిన వారి పేర్లు సిద్ధం చేయాలని అన్నారు. పోషకాహార లోపంపై తగిన అవగాహన, పనిచేయాలనే ఉత్సాహం ఉన్న సభ్యులకు మాత్రమే దీనిలో అవకాశం కల్పించాలని స్పీకర్ చెప్పారు.