ఆంధ్రప్రదేశ్‌

‘పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ఉద్యోగులకు నష్టదాయకంగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా దశల వారీ పోరాటానికి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) జాతీయ కౌన్సిల్ నిర్ణయించిందని యుటిఎఫ్ నేతలు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా నవంబర్ 29న ఢిల్లీలో వేలాది మందితో మార్చ్ టు పార్లమెంట్ మహా ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగానే దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల నుండి సేకరించిన కోటి సంతకాలతో కూడిన మెమోరాండమ్‌ను ప్రధాన మంత్రికి సమర్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు.