ఆంధ్రప్రదేశ్‌

29నుంచి సచివాలయం తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు దాదాపు పూర్తి కావస్తుండటంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయానికి మొట్టమొదట తరిలి వెళ్లే శాఖల వివరాలను ఎపి ప్రభుత్వం వెల్లడించింది. వెలగపూడికి వెళ్లే శాఖలపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 2.59 గంటలకు సచివాలయం శాఖల తరలింపును ప్రారంభించాలని ముహూర్తం కూడా నిర్ణయించినట్టు తెలిసింది. తొలుత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, రోడ్లు, భవనాలు, కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, వైద్య-ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖలు వెలగపూడికి తరలివెళ్తాయి. ఐదో భవనంలోని కింది అంతస్తులో ఈ శాఖలకు కేటాయింపులు చేస్తున్నారు. తదుపరి భవనాలు అందుబాటులోకి రాగానే మిగిలిన శాఖల తరలింపునకు చర్యలు చేపడతారు. ఇప్పటికే 70 శాతం శాఖాధిపతుల కార్యాలయాలు కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలివెళ్లాయి. మిగిలిన 30 శాతం కార్యాలయాలు సైతం కొద్ది రోజుల్లో నూతన రాజధానికి తరలివెళ్తాయని ముఖ్య కార్యదర్శి కార్యాలయం పేర్కొంది.