ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన ప్రారంభోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: విజయవాడలో ఘనంగా కార్యాలయాలు ప్రారంభించినా, చాలా ఆఫీసుల్లో ఇంకా వౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉండటంతో హైదరాబాద్ నుండి తరలి వెళ్లిన ఉద్యోగుల్లో కొంత మంది మళ్లీ వెనక్కు వచ్చారు. పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనకు మరో నెలన్నర పట్టేలా ఉందని వారు చెబుతున్నారు. సోమవారం మాత్రం లాంఛనంగా జరిగిన ప్రారంభ కార్యక్రమాలకు ఉద్యోగులు అంతా విజయవాడలో హాజరయ్యారు. అబ్కారీ, ఎక్సైజ్ శాఖ, పంచాయతీరాజ్, సంక్షేమభవన్, విద్యాభవన్ కార్యాలయాల్లో ఉద్యోగులకు మిఠాయిలు, మహిళా ఉద్యోగులకు చీరల పంపిణీ జరిగింది. అద్దె భవనాల్లో ప్రారంభోత్సవాలు, బోర్డులు తగిలించడం పూర్తయినా, కార్యాలయాల్లో ఫర్నీచర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కొంత సిమెంట్ పని కూడా ఉండటంతో పని చేసేందుకు అనుకూలం కావటానికి నెలయినా పడుతుందని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. కాలేజీయేట్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి విజయవాడ వెళ్లిన 180 మంది ఉద్యోగుల్లో చాలావరకు వెనక్కు వచ్చారని సమాచారం. ఉద్యోగుల తరలింపు సైతం కేవలం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకే అన్న రీతిలో విజయవాడ వెళ్లారు. వివిధ శాఖల్లో పనిచేస్తూ విజయవాడ, గుంటూరు సొంత ఊళ్లయిన వారు మాత్రం ఏదో ఇబ్బంది పడుతూ ఇక్కడే కొనసాగుతామని చెప్పారు. వాస్తవానికి విజయవాడలో ఇప్పటికిపుడు ఎలాంటి పని లేకపోవడంతో వారంతా ఇటు హైదరాబాద్ రావడం లేదా కొద్దిరోజులు సెలవు పెట్టి సొంతఊళ్లకు వెళ్లడమో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఉరుకులూ పరుగులూ పెట్టి కృష్ణా జిల్లాలో కొన్ని గ్రామాల్లోనూ, గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాల్లో శాఖాధిపతుల కార్యాలయాలను అద్దెకు తీసుకుని ప్రారంభించింది.
వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన శాఖ కమిషనరేట్లను గుంటూరు మార్కెట్ యార్డులో, సహకార శాఖ కార్యాలయాలన్ని శ్యామలానగర్‌లో, మున్సిపల్ శాఖ కార్యాలయాన్ని గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్‌లో, ఎన్‌జి రంగా వర్శిటీ కార్యాలయాన్ని గుంటూరు అగతవరప్పాడులో, ఇరిగేషన్ ఎస్‌ఇ కార్యాలయాన్ని గుంటూరు కంకరగుంట గేటు వద్ద, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని కలెక్టరేట్ రోడ్‌లో, అటవీశాఖ కార్యాలయాన్ని తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనరేట్‌ను ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేయగా, అబ్కారీ శాఖను ప్రసాదంపాడులో, అక్కడికి సమీపంలోనే విద్యా భవన్‌లోకి ఉన్నత విద్యాశాఖ కార్యాలయాలను తరలించారు.