ఆంధ్రప్రదేశ్‌

ప్రజల చెంతకు పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 27: రాష్ట్ర విభజన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజలకు అందుబాటులో ఉండేందుకే కార్యాలయాలను తరలిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. సోమవారం గుంటూరు నగరంలోని కలెక్టర్ బంగ్లా రోడ్డులో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, సబ్‌ప్లాన్ ద్వారా దళితవాడల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఉపాధి కల్పనకు రూ.1000 కోట్లు కేటాయించిందని, లక్ష మంది యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాదు కంటే గుంటూరు నుండి పాలనా వ్యవస్థను వేగవంతంగా అమలు చేయగలమన్న దృష్టితోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న 43మంది ఉద్యోగులు గుంటూరుకు తరలివచ్చారన్నారు. రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుతో అన్ని జిల్లాల్లో ఎస్సీ కుటుంబాలకు సౌలభ్యం కలుగుతుందని మంత్రి రావెల ఆకాంక్షించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఎస్సీ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ వైస్ చైర్మన్ విజయకుమార్, డైరెక్టర్ దేవానంద్, గుంటూరు ఇడి బాలాజీనాయక్ పాల్గొన్నారు.
జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్
ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులకు ఈ ఏడాది జంబ్లింగ్ విధానం ద్వారానే ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని మానవ వనరులు, ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం గుంటూరు లక్ష్మీపురంలో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనరేట్ కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. విద్యాశాఖ కార్యాలయాల తరలింపు కారణంగా పరీక్షల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అకడమిక్ క్యాలండర్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 29లోపు హైదరాబాద్ నుంచి కార్యాలయాల తరలింపును పూర్తిచేయాలన్న సిఎం ఆదేశాల మేరకు విజయవాడ, గుంటూరులలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గుంటూరులోని ఇంటర్మీడియట్ కమిషనరేట్ కార్యకలాపాలన్నీ వారంరోజుల్లో పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని వివరించారు. కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కమిషనర్ ఎంవి సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, నెల్లూరు ఆర్‌జెడి పరంధామయ్య, పాఠశాల విద్య ఆర్‌జెడి పి పార్వతి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు ఆర్‌డబ్ల్యుఎస్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అయ్యన్నపాత్రుడు * ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయానికి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభోత్సవం