ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్రలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/శ్రీకాకుళం, జూన్ 27: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు నమోదయ్యాయి. ఒడిశాలోని తోటపల్లి పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురియడంతో నాగావళికి వరదనీరు వచ్చి చేరుతోంది. తోటపల్లి ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం నాటికి వందమీటర్ల స్థాయిలో నీటిని స్థిరీకరిస్తూ 2767 క్యూసెక్కులు నీరు దిగువ భాగానికి విడిచిపెడుతున్నారు. వంశధార నది గొట్టాబ్యారేజ్ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదు కాగా, బ్యారేజ్‌లో నీటిమట్టాన్ని 34.55 మీటర్ల వద్ద స్థిరీకరించి 500 క్యూసెక్కుల నీటిని నది దిగువ భాగానికి విడిచిపెడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఉన్న వేగావతి, సువర్ణముఖి రెండు నదులు ప్రవహించే మడ్డువలస డ్యామ్ నిల్వ సామర్థ్యం 65 మీటర్లు కాగా ప్రస్తుతం 62.40 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది. విశాఖ నగరం, గ్రామీణ జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురిసాయి. సోమవారం మధ్యాహ్నం విశాఖ నగరం, గాజువాక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 45 నిముషాల పాటు కురిసిన భారీ వర్షాలకు పాతగాజువాక కూడలి జలమయమైంది. జాతీయ రహదారి నీట మునిగి రాకపోకలకు అంతరాయమేర్పడింది. విశాఖ మన్యంలో సోమవారం సాయంత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. విజయనగరం పట్టణంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

చిత్రం విజయనగరం జిల్లా గరుగుబిల్లి వద్ద నాగావళి ఆనకట్ట నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరద నీరు