ఆంధ్రప్రదేశ్‌

చైనా వస్తువుల్ని బహిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: పాకిస్తాన్‌కు అనుకూలంగా చైనా తనతో పాటు అతి చిన్న దేశాలైన బ్రెజిల్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, టర్కీ, న్యూజిలాండ్ దేశాల సహకారంతో అణు సరఫరా దేశాల బృందంలో భారత్‌కు సభ్యత్వాన్ని నిరాకరించడం ద్వారా మరోసారి తన అసలు రంగును బయట పెట్టిందంటూ స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర కన్వీనర్ పి జనార్ధన్ ధ్వజమెత్తారు. భారతదేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న చైనాను కట్టడి చేయటం అందరి కర్తవ్యమన్నారు. దేశ హితాన్ని దృష్టిలో వుంచుకుని చైనా వస్తువులను బహిష్కరించడం ఒక్కటే మార్గమంటూ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఈమేరకు సబ్ కలెక్టర్ ద్వారా రాష్టప్రతికి ఓ వినతిపత్రం పంపించారు. స్వేచ్ఛా విపణి పేరుతో చైనా మనదేశంలో అధికారికంగా, అనధికారికంగా తన సామగ్రిని అమ్ముకుంటూ వేల కోట్లు దండుకుని తమ దేశానికి తరలిస్తోందన్నారు.

చిత్రం స్వదేశీ జాగరణ మంచ్ ప్రదర్శన