ఆంధ్రప్రదేశ్‌

అన్నీ ఉల్లంఘనలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 27: అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో అన్నీ ఉల్లంఘనలేనని, అన్ని నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారని కాంగ్రెస్ నేత, సామాజిక ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. కృష్ణానదిని ఆనుకుని ఉన్న ఇసుక తినె్నల్లో సీడ్ క్యాపిటల్ నిర్మిస్తున్నారని విమర్శించారు. వివిధ సంస్థలకు ఇచ్చిన నివేదికలకు, వాస్తవానికి పొంతన లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తాము ప్రకృతిని పరరిక్షించేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను త్వరలో ఇవ్వనున్నామని తెలిపారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి ఎంపిక చేసిన దాదాపుస్థలం అంతా ఇసుక తినె్నలపై ఉందని, దీని వల్ల భవిష్యత్తులో నీటి సమస్య, ఇతర సమస్యలు తప్పదన్నారు. అమరావతి నిర్మాణంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన కేసు జూలై 11న విచారణకు రానుందన్నారు. ఎన్‌జిటి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పర్యావరణ శాఖ తదితర విభాగాలకు అందచేసిన నివేదికలకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు. వివిధ చట్టాలను, నిబందనలు ఉల్లంఘిస్తూ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తాను ఇచ్చిన నివేదికల్లోనే పరస్పరం విభేధించడం గమనార్హమన్నారు. తాము ఇచ్చిన నివేదికల్లో ఏమైనా తప్పులు ఉంటే ఏ దశలోనైనా వాటిని కూల్చివేసి పూర్వస్థితికి తీసుకువస్తామని ఎపిసిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్ చెప్పడాన్ని తప్పుపట్టారు. కూల్చేస్తామని చెపుతున్నారని, అందుకు వెచ్చించిన ప్రజాధనం సంగతేమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి స్థలం ఎంపిక చేసే అధికారం కేంద్రానికి ఉండగా, అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని గుర్తు చేశారు. రాజధాని నిర్మించే ప్రాంతంలో ముందు ఇసుక తినె్నలు లేవని చెప్పిన ప్రభుత్వం తరువాత ఇచ్చిన నివేదికలో ఉన్నాయని అంగీకరించిందన్నారు.సిఆర్‌డిఎ ప్రాంతంలో వ్యవసాయం జరగడం లేదని అనుమతుల కోసం చెప్పినప్పటికీ అక్కడ దాదాపు 70 శాతం ప్రాంతంలో వ్యవసాయం జరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదికల్లోనే ఉండటం గమనించాల్సిన అంశమన్నారు. 18 మంది నిపుణులతో ప్రత్యామ్నాయ రాజధాని ప్రతిపాదన రూపొందిస్తున్నామని, త్వరలో ఇది ప్రభుత్వానికి అందచేస్తామని వివరించారు. డిల్లీకి ప్రస్తుతం 400 కిలోమీటర్ల నుంచి మంచినీటిని తరలిస్తున్నారని తెలిపారు. కానీ ప్రస్తుతం 28 కిలోమీటర్ల దూరంలోని ఇసుక తినె్నల్లో బోరు వేసి నీటిని తరలిస్తున్నారన్నారు.