ఆంధ్రప్రదేశ్‌

సదావర్తి భూముల వేలం రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: ‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బీద అరుపులు అరుస్తున్నారు. మాట్లాడితే కాంగ్రెస్ అన్యాయం చేసిందని అంటున్నారు. విభజన తరువాత వచ్చిన బీదరికం ఏమిటి? విభజన చట్టంలో ఇచ్చిన హామీలను, అందులో పొందుపర్చిన అంశాలను అమలు చేయించడంలో బాబుదే అసమర్థత’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సి రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. ఇక్కడి ఎపిసిసి కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి ఆలయ అనుబంద సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందని, వాటి వేలాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, విభజన బిల్లు ఏపి అభివృద్ధికి అద్భుతంగా ఉపయోగపడుతుందని రామచంద్రయ్య అన్నారు. కానీ చంద్రబాబు తన బలహీనత వల్ల కేంద్రం నుంచి నిధులు సాధించుకోలేక చతికిలపడ్డారన్నారు. తెలంగాణతో వివాదాలు పరిష్కరించుకునే ధైర్యం లేదని విమర్శించారు. చంద్రబాబు అసమర్థత, కేంద్రంలో బిజెపి నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్ ముగుస్తున్నా నదీజలాల వివాదం తేల్చలేకపోయారన్నారు. నదీజలాల పంపిణీ నుంచి ప్రతి అంశం ‘విభజన చట్టం’లో పూర్తి వివరంగా వుందన్నారు. ‘అధికారంలోకి వచ్చినప్పుడు చేతిలో రూపాయి లేదు. ఉన్నది భూమి మాత్రమే. ల్యాండ్ పూలింగ్ విధానంతోనే రాజధాని నిర్మిస్తాన’ని చెప్పిన బాబు రెండేళ్లలో దాదాపు 40వేల కోట్లు అప్పులు తెచ్చారన్నారు. ఈ అప్పులతో ఎక్కడ అభివృద్ధి జరిగిందో వివరించాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. టిడిపి రాష్ట్రాన్ని ఆర్థిక బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం చేస్తుందంటూ దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కలసికట్టుగా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.