ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం వృక్షాల రక్షణకు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, జూన్ 27: శేషాచలం అడవుల్లో మిగిలిన ఎర్రచందనం వృక్షాలను కాపాడుకునేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బలగాలు సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. స్మగ్లర్లు, కూలీల వేటుకు నేలకొరిగిన ఎర్రచందనం వృక్షాల వివరాలు, వాటి విలువను తెలియజేసే ఫ్లెక్సీలను కడప జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేశారు. వీటి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి మిగిలిన వృక్షాలను కాపాడుకునే ప్రయత్నాలు చేపట్టారు. ఎర్రచందనం వృక్షాలకు నెలవైన శేషాచలం అటవీప్రాంతం నుండి గడిచిన 15 ఏళ్లలో స్మగ్లర్ల, కూలీలు 15 వేల ఎర్రచందనం వృక్షాలను నరికి అక్రమంగా చైనాకి తరలించి రూ. 25 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని, అదే విధంగా ఎర్రచందనం చెట్లు నరుకుతున్న కూలీల చిత్రాలు, నేలకొరిగిన వృక్షాలు, టోల్‌ఫ్రీ నెంబర్ల వివరాలు తెలియజేసే బోర్టులను ప్రత్యేక టాస్క్ఫోర్స్ బలగాలు జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం శేషాచలం అడవుల్లో మిగిలిన ఎర్రచందనం వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లా ప్రజలపై ఉందని, వీటిని సంరక్షించుకోకుంటే కాలక్రమంలో ఎర్రచందనం వృక్షాలు కనుమరగయ్యే ప్రమాదం ఉందంటూ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాయి.