ఆంధ్రప్రదేశ్‌

రూ.10 కోట్లతో ఏజెన్సీలో పోలీస్ అవుట్‌పోస్ట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 27: విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ అవుట్‌పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అవుట్‌పోస్టుల నిర్మాణానికి రూ.5 కోట్లు, వౌలిక సదుపాయాల కల్పనకు మరో 5 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మేరకు డిజిపి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో పాటు నిధుల విడుదలకు సంబంధించి జిఓ జారీ చేసింది. నూతన రాష్ట్రానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) విభాగాన్ని మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం హోం శాఖ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఏడు కంపెనీలతో కూడిన బిఎస్‌ఎఫ్ బెటాలియన్ మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్కో కంపెనీలో 100 మంది జవాన్లు ఉంటారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి జవాన్లకు శిక్షణనిచ్చే కంపెనీ కూడా ఈ బెటాలియన్‌లో ఉంటుంది.