ఆంధ్రప్రదేశ్‌

కడపలో ఉక్కు కర్మాగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 26: రాష్ట్రంలో మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనాలో అతిపెద్ద ఉక్కు కర్మాగారాల్లో ఒకటైన అన్ స్టీల్ కంపెనీ ముందుకు వచ్చింది. చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అన్ స్టీల్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ జువెన్ గేంగ్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ కంపెనీ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని కోరారు. భారతదేశంలో పబ్లిక్, ప్రైవేటు కంపెనీలతో ఉక్కు కర్మాగారాల స్థాపనపై భాగస్వాములు కావడానికి అవకాశాలను పరిశీలించాలని సిఎం కోరారు. అమరావతి నగరాన్ని నవ్య పంథాలో నిర్మించనున్నామని, ఇందుకు ఉక్కు అవసరం చాలా ఉంటుందని అన్నారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి పరిస్థితులను సమీక్షించేందుకు ఒక బృందాన్ని ఎపికి పంపించాలని చంద్రబాబు అన్ స్టీల్ కంపెనీని ఆహ్వానించారు. ఎపిలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని, పారిశ్రామిక అశాంతి లేదని చెప్పారు.
కడపలో గతంలో బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన స్థలంలో ఉక్కు కర్మాగారం ఉన్న అవకాశాలను పరిశీలించమని అన్ స్టీల్ కంపెనీ ప్రతినిధులను కోరారు. కృష్ణపట్నం పోర్టుకు ఈ స్థలం దగ్గరలో ఉంటుందని, ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.