ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడులతో రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 26: పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిరోజే బిజీబిజీగా గడిపారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు అమరావతి స్వర్గ్ధామమని, పెట్టుబడిదారులకు అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. టియాంజిన్‌లోజరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు చైనా వెళ్లడం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 4.10 గంటలకు హాంకాంగ్ చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి 6.40 గంటలకు బయల్దేరి టియాంజిన్ చేరుకున్నారు. చంద్రబాబు ముందుగా హాంగ్జ్ డెంగ్షిన్ ఇండస్ట్రీస్ గ్రూప్ చైర్మన్ జోగ్జిన్హాయ్‌తో సమావేశమయ్యారు. గనులు, ఖనిజ ఉత్పత్తి రంగంపై ఆయన చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో అపార ఖనిజసంపద గురించి ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. కాగా ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు కువైట్ డానిష్ డెయిరీ ఆసక్తి కనబరిచింది. డెయిరీ కంపెనీ సిఇఓ మహ్మద్ జాఫర్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో తమతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని చైనాకు పలంటీర్ టెక్నాలజీస్ గ్లోబల్ హెడ్ డీవ్ గ్లేజర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో సాంకేతిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చెందుతున్న తీరును చంద్రబాబు వివరించారు.
లిబ్రా గ్రూప్ ప్రతినిధులతో భేటీ
నౌకాయాన, ఆతిథ్య రంగాల్లో తొమ్మిది బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన లిబ్రా గ్రూప్ ప్రతినిధి మారిస్ వోవెన్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. లిబ్రా గ్రూప్ ఆసియా విభాగపు కార్యాలయాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. లిబ్రా గ్రూపునకు 85 నౌకలు, 45 హోటల్స్ ఉన్నాయి. నౌకాయానం, విమానయానం, పునరుత్పాదక ఇంధన రంగాలపై స్పష్టమైన ప్రతిపాదనలతో ఆంధ్రప్రదేశ్‌కు రావాలని చంద్రబాబు నాయుడు లిబ్రా గ్రూపు ప్రతినిధులను కోరారు.
‘మిత్సుబిషి’ ప్రతినిధులతో సమావేశం
మిత్సుబిషి కంపెనీ ప్రతినిధులతో కూడా సిఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మిత్సుబిషికి భారత్‌తో, ప్రత్యేకించి ఎపితో ప్రత్యేక అనుబంధం ఉందని ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యోషీ యుకి ఇషి, గ్రూప్ అడ్వైజర్ కొయిషి ఇమురా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విమానయానరంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా పవన విద్యుత్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓజిన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వాలరీ ఫెల్డ్‌మన్‌ను చంద్రబాబు కలుసుకున్నారు. పవన విద్యుత్‌ను ఏపిలో ఏర్పాటు చేయాలని ఫెల్డ్‌మన్‌ను సిఎం కోరారు.
అలాగే ఐటి ఉత్పత్తుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన హూలెట్ ప్యాకార్డ్ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రొజేరియో రిజీతో చంద్రబాబు మాట్లాడుతూ గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హూలెట్ ప్యాకార్డ్ కంపెనీతో కలిసి పనిచేశామని చెప్పారు. ఐటి రంగానికి ఎపి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఆయనకు తెలియచేశారు.
అనంతరం చంద్రబాబు నాయుడు ఎస్ప్రాంజా ఇన్నోవేషన్స్ ఫౌండర్ సిఇఓ మణిందర్ బజ్వాతో సమావేశమయ్యారు. ఎపి స్టేట్ సిలబస్‌పై కలిసి పనిచేసిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యా రంగంలో ఐటి ఉత్పత్తులను, సేవలను అందించిన తొలితరం ఐటి పారిశ్రామికవేత్తగా మణిందర్ బజ్వాకు గుర్తింపు ఉంది.
ఇక డాంగ్ ఫాంగ్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సన్ జెన్ పింగ్‌తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. డాంగ్ ఫాంగ్ చైనాలో అతి పెద్ద ఇంధన పరిశ్రమ. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే రెండు యూనిట్లను ఏర్పాటు చేసినట్టు జెన్ పింగ్ సిఎంకు వివరించారు. ఇప్పటికే 40 వేల మెగా వాట్ల యూనిట్లకు మిషనరీ అందించామని ఆయన చెప్పారు. ఉప్పునీటి శుద్ధి రంగంలో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు జెన్ పింగ్ తెలిపారు. తాము త్వరలోనే ఏపిలో పర్యటిస్తామని పింగ్ తెలియచేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ డాంగ్ ఫాంగ్ పైలెట్ ప్రాజెక్ట్‌గా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. ఈ జాయింట్ వెంచర్‌ను క్రమేణా ఇతర రాష్ట్రాలకు విస్తరిద్దామని చెప్పారు. జి2జి ఒప్పందంపై పరిశీలన జరిపి, ముందడుగు వేద్దామని సిఎం సూచించారు.
ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఈడిబీ సిఇఓ జె కృష్ణ కిశోర్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సాల్మన్ ఆరోఖ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీలంక మంత్రి సమర విక్రమతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీలంక మంత్రి సమర విక్రమతో భేటీ అయ్యారు. శ్రీలంక ప్రధాని పంపించిన శుభాకాంక్షల సందేశాన్ని ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు అందచేశారు. పర్యాటకరంగంలో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి సమర తెలియచేశారు. శ్రీలంకలో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు.

చిత్రం.. చంద్రబాబుతో సమావేశమైన ఓజిన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వాలరీ ఫెల్డ్‌మన్