ఆంధ్రప్రదేశ్‌

స్విస్ చాలెంజ్‌లో పారదర్శకత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణం బాధ్యతలను విదేశీ కంపెనీలకు స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఇవ్వాలన్న రాష్టమ్రంత్రివర్గ నిర్ణయం సరికాదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగపూర్‌కు చెందిన కంపెనీలు ముఖ్యమంత్రి చంద్రబాబు పాపులారిటీనిచూసి వచ్చాయన్న ప్రచారంలో నిజం లేదన్నారు. లాభాపేక్షతోనే ఏ సంస్ధలైనా పనిచేస్తాయన్నారు. సింగపూర్ కంపెనీలు మదర్ థెరిసా లాంటి ట్రస్టులా లేక స్వచ్చంద సంస్ధలా అని ఆయన అడిగారు. భారతప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ కూడా గతంలో స్విస్ చాలెంజ్ పద్ధతిని అధ్యయనం చేసి ఈ విధానం సరైనది కాదని తేల్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రం ఆర్ధికంగా లోటును ఎదుర్కొంటోందని చెబుతూనే దుబారాకు అలవాటుపడ్డారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వ నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టే ధోరణిని మానుకోవాలన్నారు.