ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 25: ‘మా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది... ప్రతి పనికీ జవాబుదారీగా వ్యవహరిస్తున్నాం. రాష్ట్భ్రావృద్ధి, రాజధాని నిర్మాణం సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి నిరోధకులు అడుగడుగునా అడ్డుపడి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు’ అంటూ సిఎం చంద్రబాబు మండిపడ్డారు. శనివారం నివారం నేలపాడు రైతులకు ప్లాట్ల పంపిణీ సందర్భంగా తుళ్లూరులో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన సారధ్యంలోని ప్రసార సాధనాలతో పాటు మరికొన్ని దినపత్రికల్లో వస్తున్న వార్తలపై సిఎం తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, విదేశీ మంత్రులు సైతం తరలివస్తే కార్యక్రమానికి హాజరుకాని వైఎస్ జగన్ అసత్యారోపణలు చేయడం తగదన్నారు. రాజధాని భూ సమీకరణలో లక్ష కోట్ల రూపాయలు చేతులు మారాయని, అభూత కల్పనలు సృష్టించి ప్రభుత్వంపై నిందారోపణలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అభిప్రాయపడ్డారు. రాజధాని వస్తే తమ భూములకు ఎక్కువ ధర పలుకుతుందని ఆశిస్తున్న రైతుల పొట్టకొట్టే విధంగా వార్తాకథనాలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు. సచివాలయం ఫ్లోరింగ్ కుంగిందని అనవసర రాద్ధాంతం చేశారని, మిగిలిన పత్రికలు కొన్ని అనుసరిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.‘అంతా గమనిస్తున్నా. మర్యాదగా వ్యవహరిస్తే మనుగడ ఉంటుంది. లేకపోతే ఏ రకంగా ముందుకు వెళ్తానో నాకే తెలియదు’అని ఆయన హెచ్చరించారు. రైతుల కష్టాలు, కడగండ్లు తెలియని ప్రతిపక్ష నేత మీడియాను అడ్డంపెట్టుకుని దుష్ప్రచారం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ఈ ధోరణికి ముగింపు పలుకుతామని స్పష్టంచేశారు. పోలవరం నిర్మాణం, పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు అందిస్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష నేత విమర్శలు చేస్తున్నారని ఖండించారు.