ఆంధ్రప్రదేశ్‌

అఖిలపక్ష సమావేశం నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షాలు ఏదైనా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పడి కరిచేంత పని చేస్తున్నారని ఎపి శాసనమండలి (కౌన్సిల్) లో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. రాజధాని నిర్మాణ ఒప్పందాలపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణ ఒప్పందాల్లో చిన్న ఉల్లంఘన కూడా జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తాను సర్ట్ఫికేట్ ఇచ్చుకుంటున్నారని రామచంద్రయ్య చెప్పారు. సింగపూర్ కంపెనీలకు ఇసుక సరఫరా, రహదారుల వ్యవస్థ, విద్యుత్తు, నీటి సరఫరా, భద్రత, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టబెట్టడం ఎవరి ప్రయోజనాల కోసమో తెలియడం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను గుర్తించకుండా నిరంకుశంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీడ్ రాజధాని ప్రాంతంలో సింగపూర్ కన్సార్టియంకు మొదట 50 ఎకరాలు ఉచితంగా లేదా నామమాత్రంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంలోని ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ కంపెనీలు అసెండాస్, సిన్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్బలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న స్విస్ ఛాలెంజ్ ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రామచంద్రయ్య చెప్పారు. అమరావతి రాజధానిగా ఎంపిక చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే నిర్మాణ విషయంలో, ఒప్పందాల్లో పారదర్శకతలేదని, ఆర్థిక దోపిడి జరుగుతున్నదని చెబుతున్నామని ఆయన తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి ఆర్థిక కుంభకోణంగా చరిత్రకెక్కే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.