ఆంధ్రప్రదేశ్‌

హిందూ రాష్ట్రంగా భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: భారత్‌ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని, అలాగే నేపాల్‌ను సైతం హిందూ రాష్ట్రంగా గుర్తించాలన్న డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని అఖిల భారత హిందూ అధివేషన్ ప్రకటించింది. గోవాలో జరుగుతున్న అఖిల భారత హిందూ అధివేషన్ సమ్మేళనం పలు తీర్మానాలను చేసిందని జాతీయ అధికార ప్రతినిధి రమేష్ షిండే హైదరాబాద్‌లో చెప్పారు. భారత్‌ను హిందూ రాష్ట్రంగా పార్లమెంటు ప్రకటించాలని ఒక తీర్మానం చేశామని అన్నారు. గోహత్యపై నిషేధ చట్టాన్ని తీసుకురావాలని, అందులో కఠిన శిక్షలు చేర్చాలని మరో తీర్మానం చేసినట్టు ఆయన వివరించారు. బంగ్లాదేశ్, శ్రీలంకలో హిందువులపై జరుగుతున్న దాడులను సమ్మేళనం గర్హించిందని, జమ్మూకాశ్మీర్ నుండి హిందువులకు స్వేచ్ఛ కల్పించాలని, శ్రీరామ సేన ప్రతినిధి ప్రమోద్‌ను గోవాలోకి ప్రవేశించకుండా ఇచ్చిన నిషేధ ఉత్తర్వులపై సమ్మేళనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిపై వేధింపులు ఎక్కువయ్యాయని సమ్మేళనం అభిప్రాయపడింది. హిందూ అంశాలపై పుస్తకాల్లో పాఠ్యాంశాలు చేర్చని పక్షంలో హిందువుల కోసం ప్రత్యేక యూనివర్శిటీల ఏర్పాటుకు సిద్ధం కావల్సి ఉంటుందని సమ్మేళనంలో పాల్గొన్న హిందూ విద్యా కేంద్ర డైరెక్టర్ ప్రొఫెసర్ రామేశ్వర్ మిశ్రా పేర్కొన్నారు. జర్మనీ, రష్యా, అరబ్‌దేశాలు సైతం అఖండ భారత్‌లో భాగం కావాలని ధరంపాల్ శోధ పీఠ్ డైరెక్టర్ ప్రొఫెసర్ కుసుమలత కెడియా పేర్కొన్నారు. మరో పక్క హిందూ ద్వేషంతో కొంత మంది చేస్తున్న దాడులకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధం కావాలని కూడా నిర్ణయించినట్టు రమేష్ షిండే పేర్కొన్నారు.