ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో హజ్ హౌస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 24: రంజాన్ అంటే క్రమశిక్షణ.. పవిత్రంగా జరుపుకుంటారు.. ముస్లిం మతంలో పేదరికం ఎక్కువ ఉంది.. విద్యతో పాటు సామాజిక.. ఆర్థిక.. రాజకీయ రంగాల్లో మైనారిటీలు ఎదగాల్సిన అవసరం ఉంది.. ఇందుకు ప్రభుత్వం అన్నివిధాలా చేయూత నందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. శుక్రవారం సన్నిధి కనె్వన్షన్‌లో ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మైనారిటీలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు.. నమాజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇఫ్తార్ విందు జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. మత సామరస్యాన్ని కాపాడతామన్నారు. మైనారిటీ ఆస్తులు.. ప్రాణ రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని భరోసా ఇచ్చారు. అన్ని రంగాల్లో ముస్లింలు ముందుండాలని ఆకాంక్షించారు. మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం రూ.710 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిందని తెలిపారు. పిల్లల చదువు కోసం రూ. 85 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు దుల్హన్ పథకం కింద వివాహాలకు రూ. 50వేలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తత్కాల్ స్కీం ద్వారా ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. ఈ ఏడాది 11 లక్షల మందికి రంజాన్ తోఫాను అందిస్తామని ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా చంద్రన్న రంజాన్ తోఫాను పేద ముస్లింలకు అందజేస్తున్నామని వివరించారు. పిల్లల చదువులకు ఉపకార వేతనాలను కూడా అందిస్తామన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను పూర్తిగా చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మసీదులలో ఇమాంలకు రూ. 5వేలు, వౌజన్‌లకు రూ. 3వేల చొప్పున ప్రతినెలా గౌరవ వేతనాలను అందిస్తామని వెల్లడించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడి అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకుని వాటిపై వచ్చే ఆదాయాన్ని మైనారిటీల సంక్షేమానికే కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలోని దర్గాలను పవిత్ర స్థలాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కడప, నెల్లూరు, గుంటూరు దర్గాలను యాత్రా స్థలాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యతా శిక్షణ ద్వారా ఉపాధి కల్పనకు ప్రణాళిక సిద్ధం చేసామని వివరించారు. విజయవాడలో హజ్‌హౌస్‌ను నిర్మించనున్నట్లు చెప్పారు. ఉర్దూ భాషను ప్రోత్సహించి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని ప్రకటించారు. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు నేర్చుకోవాలని హితవు పలికారు. మతపరంగా ఉర్దూ, రాష్ట్రంలో తెలుగు.. ఉపాధి కోసం ఇంగ్లీషు నేర్చుకోవటం తప్పనిసరని సూచించారు.