ఆంధ్రప్రదేశ్‌

దేశంలోనే తొలిసారిగా సహకార బ్యాంకు ఎటిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 24: సహకార బ్యాంకుల ఆధ్వర్యంలో దేశంలోనే మొట్ట మొదటి ఆటోమెటిక్ టెల్లర్ మిషన్ (ఎటిఎం)ను కర్నూలులో ప్రారంభించనున్నారు. ఈ మేరకు యంత్రాన్ని నెలకొల్పిన అధికారులు సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో ఎటిఎంను ప్రారంభించడానికి కర్నూలు సహకార బ్యాంకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశంలో సహకార రంగంలోని బ్యాంకుల్లో అతి కొద్ది బ్యాంకులు మాత్రమే లాభాల బాటలో ఉన్నాయి. వాటిలో కర్నూలు బ్యాంకు ఒకటి. కర్నూలు కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 20 ఎటిఎంల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాలను ఆన్‌లైన్ చేశారు.