ఆంధ్రప్రదేశ్‌

తిరుమల కొండపై కొండచిలువ హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 23: తిరుమల కొండపై పాపవినాశనం రోడ్డులోని టిటిడి కల్యాణ వేదికవద్ద గురువారం భారీ కొండచిలువ హల్‌చల్‌చేసింది. బుధవారం భారీ నాగుపాము కన్పించడంతో భయబ్రాంతులకు గురైన భక్తులు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పది అడుగుల కొండచిలువ గంటసేపు ఆ ప్రాంతంలో సంచరించడంతో మరింత భయభ్రాంతులకు గురయ్యారు. టిటిడి సిబ్బంది పాములు పట్టే భాస్కర్ నాయుడుకు సమాచారం అందించడంతో ఆయన చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలేశారు. ఇదిలావుండగా తిరుమల నడకమార్గంలో గురువారం వేకువజామున చిరుత కన్పించినట్టు భక్తులు చెప్పారు. అలిపిరి కాలినడక మార్గంలోని జింకల పార్కు సమీపం వద్ద అటవి ప్రాంతం నుంచి చిరుత నడకమార్గంలోకి రావడంతో భక్తులు కేకలు పెట్టారు. భక్తుల కేకలు విని చిరుత అడవిలోకి పారిపోయిందని భక్తులు చెప్పారు. పులులు భక్తులపై దాడికి చేయకముందే టిటిడి విజిలెన్స్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.