ఆంధ్రప్రదేశ్‌

ఆస్తి పన్ను ఎగవేత వ్యూహ రచనలో భవన యజమానులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: రాష్ట్ర రాజధాని అమరావతికి ఉద్యోగులు తరలివస్తున్నారు కదాయని అత్యాశతో అద్దెలు పెంచవద్దు.. అవసరమైతే రెంట్ కంట్రోల్ యాక్ట్‌ను అమల్లోకి తీసుకురావల్సి వస్తుందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయితేనేమి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అప్రతిహతంగా వెలిసిన ఆకాశహర్మ్యాలలోని ప్లాట్లలో అద్దెలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. దీనికి తగ్గట్లే రాష్ట్ర ప్రభుత్వం తరలివచ్చే ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఎ ప్రకటించింది. సచివాలయ డైరెక్టరేట్, కమిషనరేట్ అధికారులు ఉద్యోగులలో అత్యధిక మంది కనీసం 40 నుంచి 60 వేలు వరకు బేసిక్ ఉందంటున్నారు. అయితే హెచ్‌ఆర్‌ఏకు 20 వేలు వరకు సీలింగ్ ఇస్తోంది కాదాయని అపార్ట్‌మెంట్ యజమానులు త్రిబుల్ బెడ్ రూమ్‌కు రూ.20వేలు అద్దె చెబుతుంటే డబుల్ బెడ్ రూమ్‌కు రూ.12 నుంచి 15వేల వరకు అద్దె చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రభూమి పత్రికలో ‘అడుగేస్తే అపార్ట్‌మెంట్’ శీర్షిక గురువారం పతాక శీర్షికలో ప్రచురితమైన వార్త పట్ల అపార్ట్‌మెంట్ యజమానులు ఉలిక్కిపడుతున్నారు. ఏదో విధంగా ఆస్తి పన్ను లేకుండా తప్పించుకోటానికి ఆయా గ్రామాల సర్పంచ్‌లపై పలు రకాల ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇదిలా ఉంటే నిబంధనల ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వం నుంచి తాము పొందుతున్న హెచ్‌ఆర్‌ఎకి సరిపడా అద్దె ఇంటి యజమాని నుంచి రశీదు పొంది తమ తమ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంది. పైగా అదాయపు పన్ను శాఖకు ఫారం-16లో కూడా వివరాలను పొందుపరచాల్సి ఉంది. అయితే గ్రామాల్లో తమ తమ ఇళ్లు అద్దెకు ఇవ్వటం గ్రామస్థులకు కొత్త కావటం పైగా భారీగా అద్దెలను గుంజుతుండటంతో వాటికి రశీదులు ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్లు తెలియవచ్చింది. అద్దెలు తగ్గించాలని చెబుతున్న ముఖ్యమంత్రి 30 శాతం హెచ్‌ఆర్‌ఏను ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.