ఆంధ్రప్రదేశ్‌

ఏపి భవన్ సరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 23 : ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌ను తెలంగాణకు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధికి అయిన ఖర్చులో ఏపి వాటా ఇస్తారా అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ప్రశ్నించారు. గురువారం ఇక్కడ మీడి యాతో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాసిన కెసిఆర్ ఉమ్మడి ఆస్తుల విషయం కూడా చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారన్నారు. ఇవి కెసిఆర్‌కు గుర్తు లేదేమో కానీ అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పదవీ కాలంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన అనేక విద్యాసంస్థలు, అభివృద్ధి పథకాలు కలిపితే ఏపి వాటా ఇవ్వాలంటే తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ కూడా సరిపోదన్నారు.