ఆంధ్రప్రదేశ్‌

ఆలయ భూముల వేలాన్ని రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: అమరావతి అమరేశ్వరస్వామి ఆలయ అనుబంధ సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని 83 ఎకరాల భూముల వేలంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినందున తక్షణం ఆ వేలాన్ని రద్దుచేసి తిరిగి నిర్వహించాలని, ఈ వ్యవహారంపై సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధికార పక్షంలో భాగస్వామి అయిన బిజెపి ప్రత్యక్ష పోరుకు నడుం కట్టింది. ఈ భూదందాలో దాదాపు రెండువేల కోట్ల రూపాయల భూస్కాం జరిగిందంటూ బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఆ పార్టీకే చెందిన దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు మాత్రం నేటి వరకు నోరు మెదపలేకపోతుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపి నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు ఆధ్వర్యంలో గురువారం సిఎం కార్యాలయం సమీపంలో ధర్నా జరిగింది. ఈ భూముల వేలం విక్రయం రద్దయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందంటూ డాక్టర్ దాసం హెచ్చరించారు. ఈ భూములు పాడుకున్నవారు తెలుగుదేశం నేతల బినామీలుగా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ తన కుమారుని వ్యాపార భాగస్వాములు చట్టబద్ధంగానే వేలంలో ఈ భూములను కొనుగోలు చేశారని ఇందులో నారా లోకేష్‌కు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

చిత్రం అమరావతి సదావర్తి ఆలయ భూముల వేలాన్ని నిరసిస్తూ విజయవాడలో బిజెపి ధర్నా