ఆంధ్రప్రదేశ్‌

చేనేత కమిషనరేట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 23: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ శివారులోని ఎర్రబాలెం వద్దగల ఆప్కో మండల వాణిజ్య కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన చేనేత, జౌళిశాఖ కమిషనర్ రాష్ట్ర కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర చేనేత, ఎక్సైజ్‌శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. 4.32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆప్కో మండల వాణిజ్య కార్యాలయంలో కొంత భాగాన్ని కమిషనర్ కార్యాలయానికి కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈ నెలాఖరుకల్లా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు తరలిరావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించిన నేపథ్యంలో చేనేత, జౌళిశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, మార్కెట్‌యార్డు చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, చేనేత జౌళిశాఖ కమిషనర్ ఐ శ్రీనివాస్ శ్రీనరేష్, పలువురు అధికారులు, టిడిపి నేతలు పాల్గొన్నారు.

చిత్రం కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర