ఆంధ్రప్రదేశ్‌

హిందూ ధర్మానికి ప్రతీక గిరిజన సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూన్ 23: గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు హిందూ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తాయని ప్రముఖ పీఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పేర్కొన్నారు. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా అరకులోయ వచ్చిన ఆయన గురువారం పట్టణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గిరిపుత్రులు ప్రకృతిని ప్రేమిస్తూ కల్లాకపటం లేకుండా జీవిస్తారన్నారు. అందుకే భగవంతుడు కూడా గిరిజనులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి కష్టాలు లేకుండా చూస్తున్నట్టు ఆయన చెప్పారు. రాముడు కూడా గిరిజనులంటే ఇష్టపడేవారని ఆయన అన్నారు. రాముడు వనవాసం చేసినపుడు గోవిందుడిని ప్రేమించేవాడని, శబరి కూడా గిరిజనురాలేనని ఆయన చెప్పారు. చెట్లు, పుట్టలు, రాళ్లలో కూడా భగవంతుడు ఉంటాడని, మనం చూసేదానిని బట్టి భగవంతుడు కనిపిస్తాడని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను పెంపొదించుకుని భగవంతుని పూజించాలని ఆయన సూచించారు. మానవసేవే మాధవ సేవ అన్న దానిని విస్మరించరాదని, ఎదుటి వారికి ఎల్లవేళలా సేవ చేయడం అలవరచుకోవాలని ఆయన ఉద్భోదించారు. ధర్మం, న్యాయం విరాజిల్లిన చోట సుఖ శాంతులు వెల్లివిరుస్తాయన్నారు. మానవత్వ విలువలు అంతరించిపోతున్న ప్రస్తుత తరుణంలో మానవుడు భగవంతునికి తలవంచాల్సిందేనని ఆయన చెప్పారు.