ఆంధ్రప్రదేశ్‌

సోమయాజులు కమిషన్ గడువు పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 23: గోదావరి పుష్కరాల తొలి రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరాలరేవులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ సోమయాజులు ఏక సభ్య కమిషన్ గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో నిర్వహించిన విచారణకు ప్రభుత్వం తరపు న్యాయవాది సిహెచ్ ప్రభాకరరావు కమిషన్ సూచించిన వివరాలు సమర్పించలేకపోయారు. మరో రెండు వారాలు గడువు కావాలని ఆయన కోరారు. అయితే ఈ నెల 28వ తేదీకి విచారణను వాయిదా వేశారు. ఈనెల 29వ తేదీతో కమిషన్ కాలపరిమితి ముగియనుంది.
ఈనేపథ్యంలో 28న విచారణ జరిపి, ఒక్కరోజు గడువులోగా అంటే 29న కమిషన్ నివేదిక సమర్పించే అవకాశాలు కనిపించడం లేదు. గురువారం నిర్వహించిన విచారణ సందర్భంగా 28వ తేదీ నాటికి ఏ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారన్నది తెలియజేయాలని కమిషన్ ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. ఈసందర్భంగా బార్‌కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు, సిపిఎం అర్బన్‌జిల్లా కార్యదర్శి టి అరుణ్ ప్రభుత్వ తీరుపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తొక్కిసలాట దుర్ఘటనకు బాధ్యులెవరన్నది తేల్చకుండా తాత్సారం చేసేందుకు ప్రభుత్వం గడువు కోరుతోందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల సమాచారాన్ని క్రోడీకరించి నివేదికను సమర్పించినట్లు ప్రకటించగా, కమిషన్ కోరిన సమాచారాన్ని ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.
నాటి సిసి టివి పుటేజీలు కమిషన్ ముందు ఉంచితే తొక్కిసలాట దోషులెవరో తేలిపోతుందన్నారు. వైసిపి నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల్లోగా కమిషన్ విచారణ పూర్తిచేసి, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు సిఫార్సు చేయాలన్నారు. జస్టిస్ సోమయాజులుకు ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు సహాయకులుగా వ్యవహరించారు.

చిత్రం విచారణ నిర్వహిస్తున్న ఏకసభ్య కమిషన్ జస్టిస్ సోమయాజులు