ఆంధ్రప్రదేశ్‌

షార్.. ట్వంటీ ట్వంటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 22: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠ మరోసారి ఇనుమడించింది. భారత క్రికెట్ జట్టు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో గెలిస్తే ఎలా దేశం మొత్తం ఆనందపడతారో అలాగే ఈ విజయంతో యావత్ భారతావని పులకించిపోయింది. ఇస్రో తొలిసారి ఒకేసారి ప్రయోగించిన 20 ఉపగ్రహాలు దిగ్విజయంగా కక్ష్యలోకి చేరడంతో ప్రపంచ దేశాల్లో అరుదైన రికార్డు సాధించింది. మన శాస్తవ్రేత్తలు తొలి అడుగు ప్రయత్నంలోనే భారీ విజయం అందుకున్నారు. ఇస్రో శాస్తవ్రేత్తలతో పాటు ఉద్యోగులంతా 42 రోజుల్లోనే పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్‌ను సిద్ధం చేసి 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపడంతో ప్రపంచ దేశాలు సైతం షార్ వైపు చూస్తున్నాయి. ఇస్రో నమ్మినబంటు పిఎస్‌ఎల్‌విల విజయపరంపరలు షార్‌లో కొనసాగుతున్నాయి. షార్ నుండి బుధవారం ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి-34 ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో మన శాస్తవ్రేత్తలతో పాటు విదేశీ శాస్తవ్రేత్తలు కూడా సంబరాల్లో మునిగితేలారు. పిఎస్‌ఎల్‌వి వరుసగా 35వ విజయం నమోదు చేయడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేస్తోంది.
మన దేశానికి చెందిన కార్టోశాట్-2సితో పాటు చెన్నై, పుణే విద్యార్థులు రూపొందించిన రెండు, అమెరికాకు చెందిన 13 డోవ్ ఉపగ్రహాలు, ఇండోనేసియాకు చెందిన లెపాన్-ఎ 3, కెనడాకు చెందిన ఎం3ఎం శాట్, జర్మనీకి చెందిన బిరోస్, కెనడాకు చెందిన జిహెచ్‌జి శాట్ మొత్తం 20 ఉపగ్రహాలను ఒకసారి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి బుధవారం ఉదయం 9:26 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 34 వాహక నౌక ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా మోసుకెళ్లింది. దీంతో ఇస్రో ప్రతిష్ఠ కూడా ఇనుమడించి అగ్రదేశాల సరసన భారత్ నిలిచింది. ఇప్పటి వరకు షార్ నుండి మొత్తం 35 పిఎస్‌ఎల్‌విల ప్రయోగాలు జరిగాయి. ఇది 36వ ప్రయోగం కావడంతో పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ద్వారా స్వదేశీ, విదేశీ ఉపగ్రహాల ప్రయోగం చేపట్టి దిగ్విజయం చేశారు. తొలి ప్రయోగం మినహా మిగిలిన ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయి. చిన్న రాకెట్ల నుండి మొదలు పెట్టి బుడిబుడి అడుగులు వేసుకొంటున్న శాస్తవ్రేత్తలు నేడు భారీ ప్రయోగాల వైపు పరుగులు తీసే స్థాయికి చేరారు. గతంతో ఇదే తరహాలో చంద్రయాన్-1 ద్వారా ఒకేసారి పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనత కూడా ఇస్రోదే. అంతేకాకుండా షార్ నుండి ఇప్పటి వరకు 54 ప్రయోగాలు చేపట్టారు. ఇది 55వ ప్రయోగం కావడంతో ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం చిరస్థాయిగా నిలిచిపోనుంది.

ఇస్రో శాస్తవ్రేత్తలకు
చంద్రబాబు అభినందనలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 22: పిఎస్‌ఎల్‌వి సి 34 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం ప్రకటించారు. ఒకే రాకెట్ ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి షార్ శాస్తవ్రేత్తలు తమ సత్తాచాటారన్నారు. ఈ విజయం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచానికి చాటి గర్వకారణంగా నిలిచారంటూ ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు.