ఆంధ్రప్రదేశ్‌

జీవితమంతా అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 22: భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలోని రైతులకు, డ్వాక్రామహిళలకు 34వేల కోట్లరూపాయల రుణాలను మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. బుధవారం ప్రకాశం జిల్లాకేంద్రమైన ఒంగోలులోని మినీ స్టేడియంలో రెండో విడత రైతు రుణమాఫీ పత్రాలను ముఖ్యమంత్రి రైతులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి రాష్టవ్య్రవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అధ్యక్షత వహించగా సీయం ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ రైతులకు 24వేల కోట్లరూపాయలు, డ్వాక్రామహిళలకు 10వేల కోట్లరూపాయల మాఫీ చేశామన్నారు. రాష్ట్రంలోని రైతాంగానికి మొదటి విడతగా 7565కోట్లరూపాయలు, రెండవ విడతగా 3512కోట్లరూపాయల మేర రుణాలను మాఫీ చేశామన్నారు. ఇప్పటికే 50వేల రూపాయలను రైతులు తీసుకున్న రుణాలు ఒకేసారి మాఫీ చేసామని గుర్తు చేశారు. రాబోయే మూడేళ్లలో పూర్తిగా రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు. మూడో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో చేస్తామని ఆయన వెల్లడించారు. తాను ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో సమైక్య ఆంధ్రావనిలో 2811కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని స్వయంగా చూడటం వల్లనే తాను అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానని ఆనాడే ప్రకటించానన్నారు. ఆర్‌బిఐ,ప్రపంచబ్యాంకు, కేంద్రం ఈ విషయంలో సహయ సహకారాలు అందించకపోయినా రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రుణాలను మాఫీ చేశామన్నారు. తెలంగాణాలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ ఒక్కొక్క రైతుకు లక్ష రూపాయలు రుణమాఫీ జరిగిందని, డ్వాక్రామహిళలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేశామన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభాసాటిగా మార్చేవరకు తాను విశ్రమించనన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు, పరిశ్రమలకు, గృహాలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లు నూతనంగా రైతులకు ఉచితంగా ఇవ్వటమేకాకుండా ఆ పంపుసెట్లు కాలిపోయినా, రిపేర్లు వచ్చినా వాటిని మరమ్మతులు చేసి ఇంటి నుండే రిమోట్ ద్వారా పంపుసెట్లు ఆన్ అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షపార్టీలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే విపక్షాల గుండెల్లో బుల్లెట్‌లాగా దూసుకువెళ్తానని హెచ్చరించారు. అవినీతి పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పూలింగ్ ద్వారా 34వేల ఎకరాలను రైతులు స్వచ్చందంగా ఇచ్చారని హైదరాబాదును మించిన రాజధానిని తయారుచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్భ్రావృద్ధిని చూసి పార్టీలో చేరుతున్న శాసనసభ్యులను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామన్నారు.
దేశచరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. త్వరలో వర్షపునీటిని సముద్రంలోకి వెళ్లకుండా ఒడిసి పట్టేందుకు పంట సంజీవిని కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 80వేల నీటికుంటలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు అన్నివిధాల సహకారాన్ని అందిస్తున్నట్లు సిఎం తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పెన్షన్లల్లో పెద్ద అవినీతి జరిగిందని, చచ్చిపోయిన వారి పేరుతో కూడా పెన్షన్లు స్వాహా చేశారని ఆయన ధ్వజమెత్తారు. తమప్రభుత్వం పెన్షన్లను రెట్టింపు చేసి రాష్ట్రంలోని నాలుగులక్షల 50మంది కుటుంబాలకు వెయ్యి రూపాయల చొప్పున పారదర్శకంగా పెన్షన్లు అందచేస్తున్నామన్నారు. 159రూపాయలకే ప్రతి ఇంటికి వంద చానల్స్‌తోపాటు ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని త్వరలో అన్ని జిల్లాలకు కల్పిస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు అండర్‌గ్రౌండ్ ద్వారా కేబుల్ వేయాలంటే 5,434కోట్లరూపాయలు ఖర్చు అవుతుందని ప్రస్తుతం విద్యుత్ స్తంభాల ద్వారా అయితే 333 కోట్లరూపాయల ఖర్చుతో లైన్లు వేస్తామన్నారు. అమరావతి నుండి బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్ వేరోడ్డు గిద్దలూరు మీదుగా, అదేవిధంగా అనంతపురానికి ఒక ఎక్స్‌ప్రెస్ వే రోడ్డు వస్తుందన్నారు. రాష్ట్రంలోని రహదారులను పూర్తిస్ధాయిలో సర్వాంగ సుందరంగా తయారుచేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, అందులోభాగంగా గత సంవత్సరం నాలుగువేల కిలోమీటర్ల మేర రహదారులను పూర్తిచేశామని ఈసంవత్సరం ఐదువేల కిలోమీటర్ల రహదారులను నిర్మిస్తామన్నారు.
అంతకుముందు 150సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఒంగోలులోని జెఎంబి చర్చిని ముఖ్యమంత్రి సందర్శించారు. ఈసందర్భంగా మతపెద్దలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఒంగోలుప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 40కోట్ల రూపాయలతో గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఒంగోలు వరకు నిర్మించనున్న పైపులైన్ పైలాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టరేట్ వద్ద ఆవిష్కరించారు.

చిత్రం... ఒంగోలు సభలో రైతులతో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు