ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో 15మంది ఐపిఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: ఆంధ్రప్రదేశ్‌లో 15మంది ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ ఠక్కర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్ర అదనపు డిజిపి (లీగల్) వినయ్‌కుమార్ రాయ్ జైళ్లు, కరెక్షనల్ సర్వీసులకు బదిలీ అయ్యారు. ఐజిపి (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్న హరీష్‌కుమార్ గుప్తను టెక్నికల్ సర్వీసుల ఐజిపిగా; డిఐజి కెవివి గోపాల్‌రావును ఎపిఎస్‌ఆర్టీసి నుంచి తప్పించి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఐపిఎస్ అధికారి డి.నాగేంద్రకుమార్‌ను ఖాళీగా వున్న ఎసిబి జెడిగా నియమించారు. గ్రేహౌండ్స్ కమాండర్‌గా వున్న ఎస్ సెంథిల్‌కుమార్ స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న గోపీనాథ్ జెట్టిని నియమించారు. సెంథిల్‌కుమార్‌ను 6వ బెటాలియన్ ఎపిఎస్‌పిగా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న ఐపిఎస్ అధికారి గ్రేవాల్ నవదీప్‌సింగ్‌ను ఖాళీగావున్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఎస్పీగా బదిలీచేశారు. కోయ ప్రవీణ్‌ను విజయవాడ సిటీ డిసిపిగా నియమించారు. అదేవిధంగా వెయిటింగ్‌లో ఉన్న హరికృష్ణను ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీచేశారు. వి మోహన్‌రావు గుంటూరు సిఐడి ఎస్పీగా బదిలీ అయ్యారు. ఎస్పీ నవీన్ గులాటిని ఖాళీగావున్న విశాఖపట్నం సిటీ డిసిపిగా నియమించారు. కాంతి రానా టాటాను విజయవాడ సిటీ ట్రాఫిక్‌కు, ఎస్ రంగారెడ్డి ఎఐజి అడ్మినిస్ట్రేషన్‌కు బదిలీ అయ్యారు. ఎఎస్‌పి సిఐడిగా ఉన్న ఎన్.శే్వతను తూర్పుగోదావరి ఎఎస్‌పిగా బదిలీచేస్తూ చీఫ్ సెక్రటరీ ఠక్కర్ ఉత్తర్వులు జారీచేశారు.