ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల హామీలు అమలు చేయంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 16: వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు అమలు జరిగేలా చూడాలని కాంగ్రెస్ నేత, సామాజిక కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు రాష్టప్రతి, కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రాలను పంపనున్నట్లు వెల్లడించారు. విశాఖలో గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుడూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అమలు సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత వాటి అమలు గురించి మరిచిపోతున్నారన్నారు. హామీల పేరుతో ప్రజలు మోసం చేస్తున్న విషయాన్ని సుప్రీం కోర్టు గమనించి, రాజకీయ పార్టీలు మేనిఫెస్టో తయారీకి సంబంధించి మార్గదర్శక సూత్రాలను రూపొందించాలని చెప్పినప్పటికీ, ఈ విషయంలో మార్పులేదని విమర్శించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 123 సెక్షన్ ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించే వ్యవహారాలకు మాత్రమే పరిమితమైందన్నారు. అమలు సాధ్యం కాని ‘ఉచితం’లను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి, ఆ తరువాత వాటిని పట్టించుకోకపోవడం వంటి నేరాలకు పాల్పడే రాజకీయ పార్టీలను శిక్షించే వ్యవస్థ దేశంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితం పేరుతో ఇచ్చే హామీల వల్ల ఓటరు ప్రభావితం అవుతారన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. హామీలు అమలు కోసం ఆందోళన చేస్తున్న వారిని దారుణంగా అణచివేస్తున్నారని ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా శేషన్ ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియలో మార్పులు తీసుకువచ్చారని, ఇప్పుడు కూడా అటువంటి మార్పు సాధ్యమన్నారు. ఇప్పటికే ఎన్నికల హామీల అమలు గురించి వివిధ రాజకీయ పార్టీలు దాఖలు చేసిన అఫిడవిట్లను దృష్టిలో ఉంచుకుని వాటికి జవాబుదారీగా చేయాలన్నారు. 2014 ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు, అమలుపై నివేదిక విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పసుపులేని బాలరాజు మాట్లాడుతూ ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు, కేబినెట్‌లో గిరిజనులకు స్థానం, జిసిసి పాలకవర్గం నియామకం, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ విభజన, సబ్ ప్లాన్ కింద నిధుల వ్యయానికి చర్యలు వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

చిత్రం మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత బొలిశెట్టి సత్యనారాయణ