ఆంధ్రప్రదేశ్‌

సంస్థాగతంగా మరింత పుష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 16: తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కసరత్తు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లోగా పార్టీ మండల, గ్రామ, బూత్ కమిటీల స్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. జిల్లాల వారీ పరిశీలకులను నియమించి నెలవారీ సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు అందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించారు. కొన్ని జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, త్వరలో విధి విధానాలు రూపొందించి పకడ్బందీగా అమలు చేసే విషయమై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో ఇప్పటికే లోకేష్ చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో బూత్ కమిటీలను పటిష్ఠం చేసే బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా సమన్వయపర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై కూడా లోకేష్ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది చివరలో గుంటూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నందున పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక నేతలతో చర్చిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కాపు ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో కేడర్‌ను కాపాడుకునేందుకు అనుసరించాల్సిన పంధాపై ఆయా జిల్లాల నాయకులతో సమీక్షిస్తున్నారు. ఎన్నికల్లోగా కాపు రిజర్వేషన్ ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ లోపు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీలో అసమ్మతులు, నామినేటెడ్ పదవులు ఇతరత్రా అంశాలను కూడా సమీక్షిస్తున్నారు. గుంటూరులో రాష్టప్రార్టీ కార్యాలయానికి త్వరలో ఇన్‌చార్జిలను ప్రకటించి ఇక్కడ్నుంచే కార్యక్రమాలను పర్యవేక్షించే దిశగా సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలను కలుసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని చెప్తున్నారు. లోకేష్ కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తారో తమకే తెలియడం లేదని, సీనియర్లకు సమాచారం ఇవ్వడం లేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.