ఆంధ్రప్రదేశ్‌

ఏపి మాకు ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 16: రెండేళ్ల పాటు ఎటువంటి అవినీతి మరక అంటకుండా పాలన అందించడమే ఎన్ డి ఏ ప్రభుత్వ తొలి విజయంగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ డి ఏ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎటువంటి అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు ఎదుర్కోలేదని, సమర్థవంతమైన పారదర్శక పరిపాలన ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందులో భాగంగా రహదారులు, రైల్వేలకు బడ్జెట్‌లో రూ.1,25,000 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. గతంలో రోజుకు దేశంలో 7 కి.మీ. వంతున రహదారి ఏర్పాటు జరిగేదనీ, ప్రస్తుతం రోజుకు 20 కి.మీ. రహదారులు నిర్మితమవుతున్నాయన్నారు. 30 కి.మీ. మేర నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న 59 వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా రాయితీ సొమ్ము అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అందించే సబ్సిడీలో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఈ పద్ధతికి శ్రీకారం చుట్టామన్నారు. విభజన తర్వాత ఎంతో కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా తాము భావించి సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించగా ఆ విషయంపై తనకు పెద్దగా అవగాహన లేదనీ, చట్టపరమైన అంశం అయినందున వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా భావించి ఎన్నో విశ్వవిద్యాలయాలను, సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మచిలీపట్నం సమీపంలోని నిమ్మకూరులో బి హెచ్ ఇ ఎల్ కర్మాగారం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి తీసుకువచ్చేందుకు బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించామన్నారు. త్వరలోనే ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో చొరబాట్లను ప్రయత్నించేవారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు.