ఆంధ్రప్రదేశ్‌

తూ.గో.లో కొనసాగుతున్న ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 16: ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత రోజు రోజుకు పెరుగుతోంది. దీక్ష ప్రారంభం నుండీ నిషేధాజ్ఞల పేరుతో పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకుంటున్నా, మెల్లమెల్లగా వాటి ఉల్లంఘటనలు పెరుగుతున్నాయి. తమ నాయకుడిని చూడడానికి వెళ్ళనీయకుండా పోలీసులు నిరోధించడం అన్యాయమని, కనీసం టివీల ద్వారానైనా ముద్రగడను తమకు చూపించాలని కిర్లంపూడి మండలంలోని సింహాద్రిపురం మహిళలు గురువారం రోడ్డుపై బైఠాయించారు. తమకు రెండు గంటలలోగా ముద్రగడను టివీల్లో చూపకపోతే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని భారీ సంఖ్యలో మహిళలు పురుగుల మందుల డబ్బాలతో ఆందోళనలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వందలాది మంది అక్కడకు చేరుకుని, వారిపై లాఠీఛార్జీ చేయబోయారు. లాఠీ మీద పడితే చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాలను విప్పి నోటిలో పోసుకుంటామని వారు హెచ్చరించడంతో పోలీసులు వెనక్కుతగ్గారు. చివరకు రేపు సాయంత్రానికల్లా ముద్రగడ కిర్లంపూడి చేరుకుంటారని పోలీసు ఉన్నతాధికార్లు సర్దిచెప్పడంతో మహిళలు ఆంధోళన విరమించారు. ఆందోళనకారులపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న అమలాపురం సిఐ వైఆర్‌కె శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ పద్మనాభంను తక్షణమే మీడియా ముందు హాజరుపర్చాలని డిమాండ్ చేస్తూ ఒక యువకుడు గురువారం ముమ్మిడివరం బస్టాండ్ సమీపంలో గల సెల్ టవర్ ఎక్కి నాలుగున్నర గంటల పాటు హల్‌చల్ సృష్టించాడు.
విధుల నుంచి తప్పించాలని వైద్యులు మొర
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి వైద్య పరీక్షలకు నిరాకరించి, దీక్షను కొనసాగిస్తున్న నేపథ్యంలో తమను విధుల నుంచి తప్పించాలని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు గురువారం ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి వైద్యులను కంగారుపెట్టిస్తోంది. దీంతో తమను విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు వినతి పంపినట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది.