ఆంధ్రప్రదేశ్‌

కాలువల ఆధునీకరణతో భూములు సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెంటచింతల, జూన్ 16: నాగార్జున సాగర్ కాలువలు ఆధునీకరణతో ఆయకట్టు చివరి భూములు సస్యశ్యామలంగా మారతాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి డాక్టర్ డికెడి రాజా అన్నారు. గురువారం గుంటూరు జిల్లా రెంటచింతల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 20 కోట్ల రూపాయలతో ఏడు మేజర్లు ఆధునికీకరణ పనుల్లో భాగంగా మండలంలోని మల్లవరం మేజర్ కాలువను పరిశీలించారు. డిసి పరిధిలోని రెంటచింతల, పాల్వాయి, కంభంపాడు, జమ్మలమడక, తాళ్ళపల్లి, తుమృకోట మేజర్ల పనుల తీరు పరిశీలించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నాగార్జున సాగర్ కాలువలు నిర్మించబట్టే పల్నాడు ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆనాటి ఆయకట్టును బట్టి కాలువల నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. రాతి కట్టడాలు కావడంతో కాలువలు మొత్తం రాయి కదిలి ఊడిపోయాయన్నారు. నీటి ప్రవాహం వేగం తగ్గిపోయి చివరి భూములకు నీరు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయకట్టు కూడా 30 శాతం పెరిగిందన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో కాలువలను ఆధునీకరిస్తున్నామని అన్నారు. సాగర్ కమిటీ చైర్మన్ వీరభుజంగరాయలు, డిఇ వెంకటేశ్వరరావు, కెనాల్స్ ఈఈ జబ్బార్, చైర్మన్ నలబిరుదు నర్సింహారావు పాల్గొన్నారు.