ఆంధ్రప్రదేశ్‌

వచ్చి తీరాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిమోట్ పాలనా వ్యవస్థకు ఇక స్వస్తి
సచివాలయంలో ఈ ఆఫీసుతో సమస్యల పరిష్కారం
తుళ్లూరు నుంచి మంచినీటి పైపులైన్లు
సకల సదుపాయాలు కల్పిస్తాం.. నెగిటివ్‌గా ఆలోచించవద్దు
రెండున్నరేళ్లలో శాశ్వత రాజధాని
భవిష్యత్తులో ఒకే గొడుగు కింద హెచ్‌ఒడిలు
ఐదురోజులు ఇక్కడ పనిచేసి సెలవులకు వెళితే అభ్యంతరం లేదు
ముఖ్యమంత్రి చంద్రబాబు

గుంటూరు, జూన్ 15: ఉద్యోగుల తరలింపులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. రాజధానికి అంతా తరలి రావాల్సిందే అని స్పష్టం చేశారు. సచివాలయానికి ఎప్పుడు.. ఎంతమంది ఉద్యోగులను తరలించాలి.. ఏయే శాఖలకు కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశాలపై ఈ నెల 22న కార్యాచరణ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. బుధవారం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనులను పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ‘సచివాలయానికి సకల వసతులు కల్పిస్తున్నాం.. తుళ్లూరు నుంచి 7.5 కిలోమీటర్ల మేర మంచినీటి పైపులైన్ల పని పూర్తి కావచ్చింది.. అంతర్గత రోడ్ల విస్తరణ జరిపి ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తామ’ని వివరించారు. సచివాలయంలో ఈ ఆఫీస్ విధానాన్ని అవలంబించేందుకు అనువైన సాంకేతిక పరికరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారని దీనివల్ల సత్వరమే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి రిమోట్ ద్వారా పాలనా వ్యవస్థను నడపాలంటే కష్టసాధ్యమని వ్యాఖ్యానించారు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా రాలేని పరిస్థితులు ఉంటే మానవతా దృక్పథంతో ఆలోచిస్తామన్నారు. ప్రభుత్వపరంగా ప్రతి అంశాన్ని నెగటివ్‌గా తీసుకుంటే పనులు జరగవన్నారు. ‘సొంత ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అయిన వెంటనే నేరుగా రోడ్లు వస్తాయా..’ అని ప్రశ్నించారు. కొత్తగా రాజధానిని నిర్మించుకుంటున్నాం.. విభజనతో ఆర్థికంగా నష్టపోయాం.. ఇవన్నీ ఉద్యోగులు గ్రహించాలని హితవు పలికారు. రాజధానికి తరలివచ్చే విషయమై ఉద్యోగులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారని మార్కెటింగ్ సిబ్బంది ముందుగా చేరుకోవటం పట్ల ఆ శాఖ ఉద్యోగులను సిఎం అభినందించారు. మద్రాసు నుంచి కర్నూలుకు రాజధాని మార్చినప్పుడు మూడేళ్లు షెడ్లలోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రజాహితం మనకు ముఖ్యం.. ప్రతి ఒక్కరిలోనూ పట్టుదల ఉండాలన్నారు. ఈనెల 27కు వీలైనన్ని ఎక్కువ ప్రభుత్వ శాఖలను రాజధానికి తరలిస్తామన్నారు. ప్రస్తుత సచివాలయంలో మంత్రులు.. ఆయా శాఖల కార్యదర్శులు.. సచివాలయ ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తారన్నారు. హెచ్‌ఓడిలు బెజవాడ, గుంటూరులో కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మరో రెండున్నరేళ్లలో శాశ్వత రాజధాని నిర్మాణం జరిగాక హెచ్‌ఒడి వ్యవస్థను ఒకే గొడుగు కిందకు తెచ్చే అవకాశముందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఆధునిక పద్ధతులలో కార్పొరేట్ సంస్థలకు దీటుగా మెరుగైన సేవలు అందించేందుకు వినూత్న పద్ధతులను అవలంబించడం ద్వారా సుపరిపాలనకు నాంది పలకాలనేది ప్రభుత్వ సంకల్పంగా చెప్పారు. ఇందులో ఉద్యోగులు భాగస్వాములు కావాలని కోరారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి తరలి వచ్చే ఉద్యోగులకు స్థానికతపై వెసులుబాటు అంశాన్ని ప్రస్తావించగా ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ 2వ తేదీ వరకు గడువు విధించిందని గడువులోపు స్థానికత వర్తింప చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులదే అన్నారు. పెరిగిన ఇళ్ల అద్దెలు.. పిల్లల చదువుల రీత్యా ఉద్యోగులు వారంలో ఐదురోజులు పనిచేసి మిగిలిన రెండురోజుల్లో హైదరాబాద్ వెళ్లినా తమకెలాంటి అభ్యంతరం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సైబర్ గ్రిడ్‌లో భాగంగా అమరావతి నుంచి పాలనా వ్యవస్థను కేంద్రీకరించి 15 శాతం వృద్ధిరేటు సాధించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

చిత్రం... బుధవారం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు