ఆంధ్రప్రదేశ్‌

పోలీసు శాఖకు విభజన సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , జూన్ 6: ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నట్లు రాష్ట్ర డిజిపి జెవి రాముడు సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. నక్సల్స్ కార్యకలాపాలను పూర్తిగా అదుపు చేశామని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో పొలిస్తే రాష్ట్రంలో క్రైంరేటు ఈ సంవత్సరం తగ్గుముఖం పట్టినా ఇంకా తగ్గాల్సి ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పోలీసు వౌలిక సౌకర్యాల కల్పన కోసం ఇటీవల ఢిల్లీ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రానున్న కృష్ణా పుష్కరాలకు అసాధారణ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను కోరినట్లు తెలిపారు. తుని రైలు దహనం ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. ర్యాగింగ్ నిరోధానికి ఇ-బీట్, యాంటీ ర్యాగింగ్ యాప్‌లు ప్రవేశపడుతున్నట్లు చెప్పారు. గడిచిన సంవత్సరంలో రాష్ట్ర పోలీసు శాఖ పనితీరు, ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధించిన ప్రగతి, భవిష్యత్తు ప్రణాళిక, తదితర అంశాలకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చారు. విభజన వల్ల అప్పా, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాలు, పోలీసు అకాడమీ, ఆక్టోపస్, ఎఫ్‌ఎస్‌ఎల్ వంటి సంస్థలను పోలీసు శాఖ కోల్పోయిందని డిజిపి రాముడు అన్నారు. మానవ వనరుల సంఖ్య తగ్గిపోయిందని, పరికారాలు, మొబిలటీ, భవనాలు వంటి వనరుల నష్టం జరిగిందన్నారు. మరోవైపు ఏపిఎస్‌పి విభజనలో తీవ్ర జాప్యం నెలకొందని, ఆయా అంశాల్లో కేంద్ర హోంశాఖ ఇచ్చిన హామీల అమలుకు నిరీక్షిస్తున్నామని తెలిపారు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ నేరాల నియంత్రణ, మావోల ప్రభావాన్ని తగ్గించామన్నారు. విభజన నేపథ్యంలో 3వేల మంది అధికారులు ఏపీకి రావాల్సి ఉందన్నారు. 14వేల ఖాళీలు భర్తీకావాల్సి ఉందన్నారు. కష్టాల్లో సైతం ప్రభుత్వం ఆరువేల మంది నియామకానికి అంగీకారం తెలిపిందని చెప్పారు. శిక్షణ కేంద్రం లేకుండా కొత్త ఐపిఎస్‌ల నియామకాలు రాష్ట్రానికి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఖాళీల భర్తీ వనరులు, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉందన్నారు. రాజకీయ, ఫ్యాక్షన్, మావోయిస్టు, తీవ్రవాదం, మతపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. గోదావరి పుష్కరాలు, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన, విశాఖపట్నంలో భారతీయ పరిశ్రమల సమాఖ్య సమావేశం, అంతర్జాతీయ నౌకాదళ విన్యాసం వంటివాటిని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గోదావరి పుష్కరాల్లో 24వేల మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తే కృష్ణా పుష్కరాలకు 33వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌గఢ్ నుంచి, కేంద్రం నుంచి అదనపు బలగాల కోసం కేంద్ర హోంశాఖను కోరామన్నారు. నిఘా కోసం 1400 సిసి కెమెరాలు వినియోగిస్తున్నామని చెప్పారు. ఆర్థిక నేరాలు 6.55శాతం తగ్గినట్లు చెప్పారు. 0.6 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, మద్యం తాగి వాహనాలు నడపడం, లెసెన్స్ లేనివారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపామని, ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపట్టామన్నారు. అన్ని పోలీస్టేషన్లు, పోలీసు కార్యాలయాల్లో ఇంకుడు గుంతల తవ్వడం, మొక్కలు నాటేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్, శాంతిభద్రతల అదనపు డిజిపి ఆర్పీ ఠాకూర్, ఐజి హరీష్ గుప్తా, విశ్వజిత్ పాల్గొన్నారు.

chitram విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్న డిజిపి రాముడు