ఆంధ్రప్రదేశ్‌

ప్రజాతీర్పునూ గౌరవించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి కనీసం ప్రజాతీర్పును గౌరవించే పరిస్థితిలో లేడని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని హేళన చేయడం, అవమానకరంగా మాట్లాడటం అంటే ఆయనపై విశ్వాసంతో అధికారాన్ని అందించిన ప్రజలను అవమానించడమేనని అన్నారు. విపక్ష నేత చిల్లర మాటలు మాట్లాడుతున్నారని దానిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.నవనిర్మాణ దీక్ష ఏ ఒక్కరి కోసం కాదని, అన్ని రంగాల్లో పునర్‌వైభవానికి సిఎం శ్రమిస్తుంటే వైకాపా నేతలు మాత్రం రాష్ట్భ్రావృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు. ప్రతిపక్షంలో హుందాతనంతో వ్యవహరించాల్సిన వ్యక్తి సంస్కారం మరచి ప్రవర్తిస్తుండటం దారణమని , టిడిపి గత 35 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని గౌరవించిందని అన్నారు. భరోసా యాత్ర పేరుతో మూడు రోజులు అనంతపురం జిల్లాలో తిరిగిన ప్రతిపక్ష నాయకుడు కరవు కాటకాలకు ఆలవాలమైన అనంత జిల్లా ప్రజలపై దాడికి వెళ్లారా అన్నట్టు ప్రవర్తించారని పేర్కొన్నారు. సందర్భానికి తగ్గట్టు స్వర స్థాయిల హెచ్చుతగ్గులతో సంగీత విద్వాంసుడిలా నాయకులు స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.