ఆంధ్రప్రదేశ్‌

నేటితో ముగియనున్న గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి గురువారం సాయంత్రంలోగా కాపుల సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ రాని పక్షంలో ఈనెల 11వ తేదీ నుండి మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సన్నద్ధమవుతున్నారు. ఈమేరకు కిర్లంపూడిలోని తన నివాసంలో గురువారం 13 జిల్లాల కాపు నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఇటీవల తుని కాపుల ఐక్య గర్జనలో కీలకపాత్ర పోషించిన ఆయా జిల్లాలకు చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గ నేతలను ఈ సమావేశానికి ముద్రగడ ఆహ్వానించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలతో బుధవారం తన నివాసంలో ముద్రగడ చర్చలు జరిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సరిహద్దుల్లో గురువారం నుండి పోలీసులు పెద్ద ఎత్తున గస్తీ ఏర్పాటుచేస్తున్నారు. దీక్ష తప్పనిసరి అని భావిస్తున్న నేపథ్యంలో కిర్లంపూడి గ్రామ సరిహద్దుల్లో పోలీస్ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటుచేసే పనిలో అధికారులున్నారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుండి మరోసారి పోలీసు బలగాలను కిర్లంపూడికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి నుండి గురువారం సాయంత్రంలోగా సానుకూల స్పందన లభించని పక్షంలో ఈనెల 11వ తేదీ ఉదయం నుండి కిర్లంపూడిలో మరోసారి దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పద్మనాభం ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోవడం, గురువారంలోగా స్పందించే అవకాశం లేకపోవచ్చని కూడా ప్రచారం జరుగుతుండటంతో మళ్ళీ అమీతుమీకి ముద్రగడ సిద్ధమవుతున్నారు.
అరెస్ట్‌ల యోచనలో పోలీసులు!
కాగా కాపు ఐక్య గర్జన సందర్భంగా తునిలో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి సుమారు 68మందిపై పోలీసులు ఇంతవరకు కేసులు నమోదు చేశారు. వివిధ రకాల ఆధారాలతో వివిధ జిల్లాలకు చెందిన వారిపై ఈ కేసులు నమోదయ్యాయి. రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్లు, పోలీసు, ప్రైవేటు వాహనాల దగ్ధం, హింసలో పాల్గొన్న వారిపై కేసులు నమోదయ్యాయి. నిందితులను అరెస్ట్ చేసే యోచనలో కూడా పోలీసు వర్గాలున్నాయి. ఇదే సమయంలో ముద్రగడ మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్న నేపథ్యంలో ఈదఫా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుండి పోలీస్ శాఖకు ఆదేశాలందాయి. ముఖ్యంగా హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం లేకుండా కఠినంగా వ్యవహరించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటుచేసి, విద్రోహశక్తులు ఇతర ప్రాంతాల నుండి చొరబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కిర్లంపూడిలో దీక్షా ప్రదేశానికి వెళ్ళే అవకాశం లేకుండా భద్రతాచర్యలు ఏర్పాటుచేయాల్సిందిగా రాష్ట్ర హోంశాఖ నుండి జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. కిర్లంపూడిలో ముద్రగడకు పరామర్శల పేరుతో ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారిపై నిఘా ఉంచి, ఎక్కడికక్కడే వారిని అడ్డుకుని, అవసరమైతే అరెస్టులు చేయాలని కూడా ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.