ఆంధ్రప్రదేశ్‌

ఎంఎల్‌నేత సోమాచారి అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూన్ 6: సిపిఐ ఎంఎల్ ప్రతిఘటన కేంద్ర కమిటీ సభ్యుడు, కమ్యూనిస్టు యోధుడు మొగులూరి సోమాచారి (95) సోమవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటి 1938 కాలంలో సామర్లకోట కార్యదర్శిగా పనిచేస్తూ సామర్లకోట డెక్కన్ సుగర్స్ ఫ్యాక్టరీలో పనిచేశారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. కమ్యూనిస్టు పార్టీలు విడిపోయిన తర్వాత 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామర్లకోట అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఎం తరపున పోటీచేశారు. సిపిఎం నుండి విప్లవకారులు చీలిపోయినపుడు చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలోని సిపిఐ (ఎంఎల్) వైపు వచ్చారు. ఎమర్జన్సీ కాలంలో పలుమార్లు అరెస్టయ్యి సుమారు రెండేళ్లకు పైగా పలు కేసుల్లో జైలు జీవితం సోమాచారి గడిపారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం సామర్లకోటలో జరగనున్నాయి.