ఆంధ్రప్రదేశ్‌

నేడే నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: మరో చారిత్రక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమైంది. మరో కొన్ని గంటల వ్యవధిలోనే ఇస్రో శాస్తవ్రేత్తలు సొంత నావిగేషన్ వ్యవస్థ అధ్యయానికి సర్వసిద్ధం చేశారు. సరికొత్త స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే మనకు సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. నెల్లూరుజిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి గురువారం సాయంత్రం 4గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుండి జరిగే ఈ రాకెట్ ద్వారా 1425కిలోల బరువుగల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 8న మంగళవారం ఉదయం 9:30గంటలకు ప్రారంభమై సజావుగా కొనసాగుతోంది. షార్‌లోని రెండోప్రయోగ వేదిక నుండి జరిగే ఈ పిఎస్‌ఎల్‌వి-సి 32 వాహక నౌక ద్వారా నావిగేషన్ సిరీస్‌కు సంబంధించిన భారత క్షేత్రీయ దిక్సూచి ఐదో ఉపగ్రహాన్ని (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్) మోసుకెళ్లనుంది. మన దేశ నావిగేషన్ సేవల అవసరాల నిమిత్తం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థలను రూపొందించుకొనేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలోరాకెట్‌లోని రెండు, నాలుగు దశల్లో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతోపాటు హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను నింపే పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరు తదితర వాటిని పరిశీలించి గ్లోబల్ పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కిరణ్‌కుమార్ మధ్యాహ్నం షార్‌కు చేసుకొని ప్రయోగ వేదిక పై ఉన్న పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ను శాస్తవ్రేత్తలతో కలసి పరిశీలించారు.

మొండి బకాయిల వసూళ్లకు కమిషనర్ ధర్నా
పుంగనూరు రూరల్, మార్చి 9: చాలా కాలంగా పురపాలికకు రావలసిన మొండిబకాయిల వసూళ్లకు కమిషనర్ కెఎల్.వర్మ నడుం బిగించారు. పన్ను ఎగవేతదారుల ఇంటి ఎదుట సిబ్బందితో సహా బైఠాయించి నోటికి నల్లగుడ్డలు కట్టుకుని శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం చిత్తూరు జిల్లా పుంగనూరు రూరల్ మండలం కొత్త ఇండ్లు ప్రాంతంలో ప్రారంభించిన వినూత్న ధర్నా సత్ఫలితాలివ్వడంతో బుధవారం పట్టణంలోని తాజ్‌మహల్ థియేటర్ ఎదుట ధర్నాకు దిగారు. చివరకు భవన యజమాని పన్నులు చెల్లించడంతో ధర్నా విరమించారు. ధర్నాలో పారిశుధ్య అధికారి సప్దార్,శానిటరీ ఇన్‌స్పెక్టర్ సురేంద్రబాబు, మేనేజర్ రమణారెడ్డి, సిబ్బంది మురళీకృష్ణారెడ్డి, శ్రీనివాసులుగౌడ్, కార్మికులు పాల్గొన్నారు.
టాస్క్ఫోర్స్‌పై కూలీల రాళ్ల వర్షం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మార్చి 9: శేషాచలం అటవీ ప్రాంతంలోని కడప జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట వద్ద బుధవారం ఉదయం టాస్క్ఫోర్స్ అధికారులు, సిబ్బందిపై ఎర్రకూలీలు రాళ్లవర్షం కురిపించి పరారయ్యారు. ఈ సంఘటనలో సుమారు 2 కోట్ల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను, వాటిని రవాణా చేస్తున్న గ్యాస్ ట్యాంకర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి నిత్యం ఇదే ప్రాంతంలో కోట్లాదిరూపాయలు విలువచేసే ఎర్రచందనం దుంగలు పట్టుకోవడం రివాజుగా మారింది. బుధవారం ఉదయం సుమారు వందమంది ఎర్రకూలీలు...టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై రాళ్లు రువ్వుతూ పరారైనట్టు పోలీసువర్గాల సమాచారం. ఈ విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ డిఐజి డాక్టర్ ఎం కాంతారావు, కన్వర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ చలపతిరావు, ఫ్లయింగ్ స్వ్కాడ్ డిఎఫ్‌ఓ సుబ్బారెడ్డి, టాస్క్ఫోర్స్ డిఎస్పీ శ్రీ్ధర్‌రావు భారీ బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కడప ,చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన సివిల్ పోలీసులు, మరో 400 మంది టాస్క్ఫోర్స్ సిబ్బంది గత నాలుగురోజులుగా శేషాచలం అడవుల్లో కూంబింగ్ చేస్తున్నా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఆపలేకపోతున్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
గూడూరు, మార్చి 9: తాను మనసుపడ్డ అమ్మాయి తనను ప్రేమించలేదని మనస్తాపంతో ఇంజనీరింగ్ విద్యార్థి కాలేజీ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలన కలిగించింది. నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్(సివిల్) మూడో సంవత్సరం చదువుతున్న తలమంచి ప్రవీణ్‌కుమార్(22) బుధవారం హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకొని మృతి చెందాడు. ప్రవీణ్‌కుమార్ బుధవారం ఉదయం రెండు క్లాసులకు హాజరై మధ్యలోనే హాస్టల్ రూమ్‌కు చేరుకున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో వాచ్‌మెన్ భోజనం కోసం పిలిచే ప్రయత్నంలో గది తలుపులు వేసి ఉండడంతో లోనికి తొంగి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండడాన్ని గమనించాడు. విషయాన్ని వార్డెన్‌కు ఇతర విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే అతనిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కళాశాలలోని ఓ విద్యార్థినితో సన్నిహితంగా మెలిగి ప్రేమలో పడ్డట్టు, ఈ విషయం గురించి ఆ విద్యార్థినికి తెలియ చేయడంతో తాను నిన్ను స్నేహితునిగా చూస్తున్నానని, చెప్పడంతో మనస్థాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కలెక్టరేట్‌లో డిటి ఆత్మహత్యాయత్నం
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, మార్చి 9: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. కలెక్టరేట్‌లో డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్(45) బుధవారం కార్యాలయంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగడంతో కార్యాలయంలోనే స్పృహ తప్పిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది హుటాహుటిన అరగొండ అపోలోకు తరలించారు. ఇటీవల సుధాకర్‌పై అవినీతి ఆరోపణలు రావడం, కొందరి వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ అతనిపై విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక కూడా పూర్తి అయినట్లు తెలిసింది. అయితే ఈ విచారణతో తనపై వేటు తప్పదని భావించిన సుధాకర్ మనస్థాపానికి లోనై కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగినట్లు సమాచారం. సుధాకర్ తన ఛాంబర్‌లోని కుర్చీలోనే అపస్మారక స్థితికి చేరుకోవడంతో విషయాన్ని గమనించిన తోటి సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుధాకర్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
వైఎస్ కుటుంబీకుల భూములపై వాకబు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,మార్చి 9: నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతి బినామీ భూముల ప్రకంపనల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఎదురుదాడికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కడప జిల్లాలో గతంలో వైఎస్ హయాంలో ఆయన కుటుంబీకులు తీసుకున్న ప్రభుత్వ భూములపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్టన్రేత, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య జిల్లాకు చేరుకుని జగన్ భూములపై వాకబు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్ భూములు 650 ఎకరాలు వైఎస్ కుటుంబీకులు ఆక్రమించుకున్నారని, వాటిపై నిగ్గుతేల్చాలని వర్గ రామయ్య బుధవారం కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన తండ్రి హయాంలో 650 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని అప్పనంగా పొందారని ఆరోపించారు. పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ, రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వైఎస్ కుటుంబీకుల భూముల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాఉంటే వైఎస్ హయాంలో ఆయన కుటుంబీకులు తీసుకున్న అసైన్డ్ భూముల వివరాలు అందజేయాలని రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కొత్తపట్నం బీచ్ అభివృద్ధికి చర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9 : ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం బీచ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని కార్మిక ఉపాధి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం నాడు శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి తరఫున అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ, ఈ బీచ్ అభివృద్ధి కోసం 2.50 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం, కాలిబాటలు, పర్యాటక సౌకర్యాల కేంద్రాలు, బీచ్ షేక్స్ తదితర పనులు అభివృద్ధిలో భాగంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలోని విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొండలు, సుదూరప్రాంతాల్లో పెంచుతున్న గంజాయివనాలపై దాడులు చేసి వాటిని నిర్వీర్యం చేస్తున్నామని ఆబ్కారి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎంవివిఎస్ మూర్తి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ, గంజాయి పెంచుతున్న వారిపై గత మూడేళ్లలో 157 కేసులు నమోదు చేశామని, 161 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో 285 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (స్కిల్ డెవలప్‌మెంట్) ఉన్నాయని కార్మిక, ఉపాధి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఏసిబి వలలో
రెండు తిమింగలాలు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ/చింతలపూడి, మార్చి 9: గోదావరి జిల్లాలో రెండు అవినీతి తిమింగలాలు ఏసిబి వలలో చిక్కాయ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు కలెక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం ఒక వ్యక్తి నుండి రూ.25 వేలు లంచం తీసుకున్న చింతలపూడి సబ్-రిజిస్ట్రార్‌ను అవినీతి నిరోధక శాఖ అధికార్లు బుధవారం వలపన్ని పట్టుకున్నారు. ఏలూరుకు చెందిన గోలి శరత్ రెడ్డి అనే వ్యక్తి చింతలపూడి మండలం ప్రగడవరంలో 70 సెంట్లు భూమి రిజిస్ట్రేషన్ కోసం గత నెల 17న సబ్-రిజిస్ట్రార్ బి.గోపాలకృష్ణను సంప్రదించారు. అయితే ఆ భూమి నిషేధిత జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేషన్ కుదరదని సమాధానం వచ్చింది. తన వద్ద ఉన్న ఎన్‌ఒసి సర్ట్ఫికెట్‌ను చూపించినా రిజిస్ట్రేషన్‌కు సబ్-రిజిస్ట్రార్ నిరాకరించారు. ఈ సందర్భంగా వారిరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తిరిగి ఒక మధ్యవర్తి ద్వారా భూమి రిజిస్ట్రేషన్ కోసం శరత్‌రెడ్డి సబ్-రిజిస్ట్రార్ గోపాలకృష్ణను సంప్రదించారు. రూ.50 వేలు లంచం ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని సబ్-రిజిస్ట్రార్ తేల్చిచెప్పారు.రూ.25వేలకు బేరం కుదిరింది. దీంతో శరత్‌రెడ్డి ఏసిబి అధికార్లను ఆశ్రయించారు. బుధవారం తన కార్యాలయంలో రూ.25వేలు లంచం తీసుకుంటున్న సబ్-రిజిస్ట్రార్ గోపాలకృష్ణను ఏసిబి అధికార్లు వలపన్ని పట్టుకున్నారు. కాకినాడ నగరంలోని నరసన్ననగర్‌లో పెద్దిరెడ్డి పెద్దిరాజు అనే వ్యక్తికి 203 చదరపు గజాల ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలానికి చాలా సంవత్సరాలుగా పన్ను బకాయి పడ్డారని, తనకు రూ.50 వేలు లంచం ఇస్తే, ఒక ఏడాదికి మాత్రమే పన్ను విధించేలా సహకరిస్తానని బిల్ కలెక్టర్ కృష్ణ తెలిపాడు. తాను రూ.30 వేలు మాత్రమే ఇచ్చుకోగలనని, బకాయిలు పూర్తిగా తగ్గించి పన్ను వేసి పెట్టాలని పెద్దిరాజు కోరాడు. పెద్దిరాజు ఏసిబి అధికార్ల దృష్టికి తీసుకువెళ్ళాడు. బుధవారం ఉదయం నరసన్ననగర్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు కృష్ణ అక్కడికి చేరుకోగా అక్కడే ఉన్న పెద్దిరాజు అల్లుడు బుజ్జి రూ. 30 వేలు బిల్లు కలెక్టర్‌కు అందించాడు.