ఆంధ్రప్రదేశ్‌

కర్నూలును ముంచెత్తిన భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 4: కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని 54 మండలాల్లో వర్షం కురవడంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 3.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో జూన్ నెల సగటు వర్షపాతం 77.20 మిమీ కాగా గత నాలుగు రోజుల్లోనే 47.40 మిమీ వర్షం కురవడం గమనార్హం. వరద నీటితో హంద్రీనది పొంగిపొర్లుతోంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదోని డివిజన్‌లోని పాండవగల్లు వంక, ఉప్పలదొడ్డి వాగు పొంగిపొర్లాయి. వర్షాలకు ఎమ్మిగనూరు రోడ్డులోని వంకనీరు పొంగి ప్రవహించి తిరుమలనగర్‌లోని గుడిసెవాసుల ఇళ్లలోకి చేరుకున్నాయి. మద్దికెర మండలంలో కురిసిన భారీ వర్షానికి బురుజల వద్ద హంద్రీనది పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. నందికొట్కూరు పట్టణంలో కురిసిన భారీ వర్షానికి మారుతీనగర్ జలమయమైంది. చాగలమర్రి మండలంలోని వక్కిలేరు, భవనాశి నదులు జలకళ సంతరించుకున్నాయి. పెద్దబోధనం వద్ద వక్కిలేరు నదికి వరద పోటెత్తింది. పలుచోట్ల గాలివానకు పెద్దమొత్తంలో పంట నష్టం జరిగింది. నంద్యాల పట్టణంలోని పలు వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

chitram కల్లెవంక వాగులో బోల్తాపడిన జొన్నల లోడు లారీ