ఆంధ్రప్రదేశ్‌

డిజిటల్ సేవల్లో భారత్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 4: డిజిటల్ ఇండియాతో భారత్ ప్రపంచంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటి శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ చెప్పారు. ఈ విధానంతో దేశంలో సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని, నకిలీ రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులను తొలగించామని, వివిధ సంక్షేమ పథకాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అమలుచేస్తున్నట్టు చెప్పారు. కాకినాడ నగరంలో శనివారం జరిగిన సదస్సుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సుదర్శన్ భగత్‌తో కలసి ఆయన హాజరయ్యారు. రవిశంకర్‌ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో ప్రపంచంలో ఎక్కడినుండి ఎక్కడ ఉన్న బంధువులనైనా చూడగలుగుతున్నామన్నారు. టెలికాం ద్వారా దేశానికి చాలా ఆదాయం లభిస్తోందని, ఐటి ద్వారా ఇండియా పెద్ద ఎత్తున ఆర్థికావృద్ధి సాధిస్తోందన్నారు. డిజిటల్ ఇండియా నినాదం ద్వారా ప్రస్తుతం సుమారు 40 కోట్లమంది డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా సేవలను అందించనున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. ప్రస్తుతం సుమారు వంద కోట్ల మంది ప్రజలు మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారన్నారు. ఐతే వాటికి మరమ్మత్తులు నిర్వహించే సాంకేతిక నిపుణుల కొరత ఉందని, ఈ కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐటి రంగం ద్వారా 27వేల కోట్ల విదేశీ పెట్టుబడులను ప్రత్యక్షంగా సాధించామని రవిశంకర్‌ప్రసాద్ చెప్పారు. కేంద్ర గ్రామీణావృద్ధి సహాయ మంత్రి సురేష్ భగత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సామాన్యులకు చేరుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ శాఖల సేవలు అత్యంత పారదర్శకంగా ప్రజలకు అందేలా ప్రథాని మోదీ నాయకత్వంలో కృషి జరుగుతోందన్నారు.