ఆంధ్రప్రదేశ్‌

హామీలపై నిలదీయడం తప్పా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం (తలుపుల), జూన్ 4:‘ప్రజలను మోసపుచ్చిన వారిని చెప్పుతో కొట్టాలి అని చెప్పడం రాయలసీమలో సహజమని, ఎవరైనా డబ్బు తీసుకుని మోసం చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుతో కొడతామని అంటారని, ఆచరణ సాధ్యం కాని హామీలతో కొట్లాది మంది రాష్ట్ర ప్రజలను మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును చెప్పుతో కొట్టాలనడం తప్పెలా అవుతుందని’ వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న రైతు భరోసాయాత్రలో భాగంగా నాలుగోరోజు శనివారం రాత్రి కదిరి పట్టణంలోని జీవిమాను సర్కిల్‌లో జరిగిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం రాని నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగభృతి సైతం చెల్లించలేదని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు చెల్లించలేదన్నారు. దీంతో రైతులు రూ.3 వడ్డీతో బ్యాంకులకు రూ.25 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. అదే విధంగా డ్వాక్రా మహిళలకురూ.3 వేలు చొప్పున అప్పుగా ఇచ్చి దాన్ని మాఫీ కింద చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో చంద్రబాబు లేరని జగన్ అన్నారు. రెండేన్నరేళ్ల పాలనలో జరిగిన కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపి ఎక్కడ తనను జైలులో పెడతారోనన్న భయంతో మోదీని ఏమీ అడగరని ఏద్దేవా చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరు రాకుండా తెలంగాణ సిఎం ఎగువ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలిస్తున్నా ప్రశ్నించరని చంద్రబాబును విమర్శించారు. గోదావరి నదిపై అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా కెసిఆర్‌ను ప్రశ్నించే స్థాయిలో చంద్రబాబు లేరన్నారు. గోదావరి నుంచి నీరు రాకుంటే పోతిరెడ్డిపాడు జళాశయం ఎండిపోతుందని, అప్పుడు తాగునీరు కూడా దొరకదన్నారు. ఏడాది క్రితం తెలంగాణ ఎమ్మెల్యేలను నల్లధనంతో కొనుగోలు చేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయారన్నారు. ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తే కెసిఆర్ జైలులో పెట్టిస్తారన్న భయంతో బాబు నోరు మెదపడం లేదన్నారు.

chitram కదిరి రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్